23rd TANA Conference: తానా సభల్లో ఏపీ రాజకీయాలు, అభివృద్ధిపై చర్చ.. సమన్వకర్తలుగా టీవీ9 ప్రతినిధులు..

|

Jul 06, 2023 | 7:46 AM

23rd TANA Conference: అమెరికాలో తెలుగు వారి సందడి మొదలు కాబోతోంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా - TANA వేడుకలు మరికొన్ని గంటల్లో ప్రారంభకానున్నాయి. ఈ మేరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) భారీ ఏర్పాట్లు చేసింది.

23rd TANA Conference: తానా సభల్లో ఏపీ రాజకీయాలు, అభివృద్ధిపై చర్చ.. సమన్వకర్తలుగా టీవీ9 ప్రతినిధులు..
Tana
Follow us on

23rd TANA Conference: అమెరికాలో తెలుగు వారి సందడి మొదలు కాబోతోంది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా – TANA వేడుకలు మరికొన్ని గంటల్లో ప్రారంభకానున్నాయి. ఈ మేరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) భారీ ఏర్పాట్లు చేసింది. ప్రతిష్టాత్మక తానా 23వ మహాసభలు ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, నారిస్ టౌన్‌లో జరగనున్నాయి. పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జులై 7, 8, 9వ తేదీలలో జరిగే తానా మహాసభల కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్ రవి పొట్లూరి తెలిపారు. ఈ సమావేశాల్లో తానా అవార్డులు సైతం అందజేయనున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు.. పలు రంగాలపై చర్చ కూడా నిర్వహించనున్నారు. కాగా.. తానా సభల్లో జులై 8న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు ఆంధ్రా పొలిటికల్ ఫోరం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ రాజకీయాలు, అభివృద్ధిపై కూడా చర్చనిర్వహించనున్నారు. తానా ప్రతినిధులు, ఏపీకి చెందిన పలువురు రాజకీయ నాయకులు హాజరుకానున్న ఈ సమావేశానికి సమన్వకర్తలుగా టీవీ9 ప్రతినిధులు వ్యవహరించనున్నారు. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ వి. రజనీకాంత్, సుకుమార్ ఏపీ రాజకీయాలు, అభివృద్ధికి సంబంధించి కీలక చర్చ నిర్వహించనున్నారు.

TANA

ఏపీ రాజకీయ పరిస్థితులు, అభివృద్ధితోపాటు.. రాష్ట్రంలో పెట్టుబడులు తదితర అంశాల గురించి చర్చించనున్నారు. కాగా.. తానా మహా సభలకు నందమూరి బాలకృష్ణ సహా.. పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. తానా మహాసభల కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లు ప్రతినిధులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..