H1b visa: తరుముకొస్తున్న గడువు.. అగమ్యగోచరంగా అమెరికాలో మన టెక్కీల పరిస్థితి.

ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను ఇంటికి పంపించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగుల తొలగింపు తారా స్థాయికి చేరింది...

H1b visa: తరుముకొస్తున్న గడువు.. అగమ్యగోచరంగా అమెరికాలో మన టెక్కీల పరిస్థితి.
H1b Visa
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 19, 2023 | 8:50 AM

ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో ప్రపంచ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను ఇంటికి పంపించిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగుల తొలగింపు తారా స్థాయికి చేరింది. అంచనా ప్రకారం అమెరికాలో కనీసం 2.5 లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. వీరిలో సుమారు లక్ష మంది దాకా భారతీయులేనని అంచనా. దీంతో హెచ్‌–1బి ఇమిగ్రెంట్లయిన వీరు 60 రోజుల్లోగా కొత్త ఉద్యోగం వెదుక్కుని సదరు కంపెనీ ద్వారా హెచ్‌–1బికి దరఖాస్తు చేసుకోలేని పక్షంలో దేశం వీడాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ రోజుల గ్రేస్‌ పీరియడ్‌ ముగిసే సమయం ఆసన్నమైంది. దీంతో అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్‌–1బీ ప్రొఫెషనల్స్‌ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోందని ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పొరా స్టడీస్‌ (ఎఫ్‌ఐఐడీఎస్‌) ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘సదరు కుటుంబాలకు ఇది పెను సంక్షోభం. వారికి చూస్తుండగానే సమయం మించిపోతోంది. అమెరికాలో పుట్టిన తమ పిల్లలను వెంటపెట్టుకుని వారి త్వరలో దేశం వీడాల్సిన పరిస్థితులు వచ్చాయి’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇదిలా ఉంటే గ్రేస్‌ పీరియడ్‌ గడువును 180 రోజులకు పెంచాలంటూ.. ఆసియా అమెరికన్ల వ్యవహారాలకు సంబంధించిన అధ్యక్షుని సలహా కమిటీ ఇటీవలే సిఫార్సు చేశారు. అయితే దీనిపై అమెరికా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకున్నా.. ఆమోదం పొంది అమల్లోకి రావడానికి సమయం పడుతుంది. ఈలోపు 60 రోజుల గడువు ముగిసిన వారు దేశం వీడటం తప్ప మరో మార్గం లేదని ఫౌండేషన్‌ ఫర్‌ ఇండియా అండ్‌ ఇండియన్‌ డయాస్పొరా స్టడీస్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..