సౌదీ అరేబియాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మక్కాలో ఉమ్రా చేసేందుకు వెళ్తున్న బస్సు బోల్తా పడడంతో 20 మంది దుర్మరణం చెందారు. మరో 30 మంది గాయపడ్డారని గల్ఫ్ మీడియా వెల్లడించింది. ఈ దుర్ఘటన సౌదీ అసిర్ గవర్నరేట్‌లోని అకాబా షార్‌లో సోమవారం జరిగింది. హజ్ యాత్రికులతో వెళ్తున్న బస్సు.. సోమవారం బ్రేకులు ఫెయిల్ అయి బ్రిడ్జ్‌ని ఢీ కొట్టింది. బోల్తా పడిన అనంతరం బస్సులోంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సులోని 20 మంది చనిపోగా, మరో 30మందికి గాయపడ్డారని సౌదీ మీడియా వెల్లడించింది.
సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు.
యెమెన్ సరిహద్దులోని నైరుతి అసిర్ ప్రావిన్స్‌లో వాహనం బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదం అనంతరం చెలరేగిన మంటలను అదుపు చేసినట్లు ఫైర్ సిబ్బంది తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..