Cheetah vs Dog: ఆ కుక్క చేసిన పనికి చిరుత పరుగో పరుగు.. సీసీ కెమెరా వీడియో వైరల్.

|

Jul 03, 2023 | 9:12 AM

చిరుతపులి గురించి అందరికీ తెలిసిన విషయమే. దానివేగం, వేటతీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఎంతటి జంతువునైనా క్షణాల్లో వేటాడేస్తుంది. అంతటి చిరుత కూడా తనది కాని ప్రాంతానికి వస్తే ఏం జరుగుతుందో ఈ వీడియో చూస్తే అర్ధమవుతుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో అర్థరాత్రి వేళ ఓ ఇంట్లోకి ప్రవేశించిన చిరుత, కంటికి కనిపించిన కుక్కపై దాడికి ప్రయత్నించింది. వెంటనే అప్రమత్తమైన ఆ పెంపుడు కుక్క ఎదురుదాడికి దిగింది. అంతే ఒక్కసారిగా వెనక్కు పడిన చిరుత అక్కడ నుంచి పరుగులు తీసింది. అయితే ఈ ఘటన విషయంలో తర్వాత ఏం జరిగింది అనే విషయాలు తెలియరాలేదు. ఈ వీడియోను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. ఇది మహారాష్ట్ర అహల్యానగర్‌లోని రాహూరి తాలుకాలో జరిగినట్టు తెలుస్తోంది. కళ్లు కనిపించనంతటి చీకటిలో తన ఇంటికి వచ్చిన చిరుతకు చుక్కలు చూపించిన సదరు పెంపుడు కుక్క ఇప్పుడు నెటిజన్ల దృష్టిలో హీరోగా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...