Viral Video: వామ్మో.. మనుషులనైతే అమాంతం మింగేస్తది.. నెట్టింట దడ పుట్టిస్తున్న భారీ పైథాన్.. వీడియో చూస్తే..

|

Mar 29, 2023 | 9:58 AM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువుగా ఉంటాయి. పాములు, అనకొండలకు సంబంధించిన వీడియోలు భయంకరంగా ఉంటాయి.

Viral Video: వామ్మో.. మనుషులనైతే అమాంతం మింగేస్తది.. నెట్టింట దడ పుట్టిస్తున్న భారీ పైథాన్.. వీడియో చూస్తే..
Viral Video
Follow us on

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువుగా ఉంటాయి. పాములు, అనకొండలకు సంబంధించిన వీడియోలు భయంకరంగా ఉంటాయి. అయితే, ప్రపంచంలోనే అత్యంత పొడువైన భారీ పైథాన్ కు సంబంధించిన వీడియో తాజాగా.. తెగ వైరల్ అవుతోంది. దీనిని చూస్తే అమాంతం మనుషులను మింగే విధంగా ఉంది. నెటిజన్లు దీనిని చూసి వామ్మో అంటూ భయపడుతున్నారు. సాధారణంగా పాము పేరు వింటేనే చాలా మంది భయంతో వణికిపోతుంటారు. అయితే.. అత్యంత ప్రమాదకరమైన భారీ పాము ఇంటికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అచ్చం అలాంటి సంఘటనే ఈ వీడియోలో కనిపిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భారీ పైథాన్ ను చూసి నెటిజన్లు సైతం భయపడుతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో భారీ ఫైథాన్ ఇంట్లోకి ప్రవేశిస్తుండాన్ని చూడవచ్చు. ఎత్తైన గోడ పై నుంచి కిందకు దిగి.. వరెండాలోకి ప్రవేశిస్తుంది. పైథాన్ వెళ్లే చోట ఓ వాటర్ బాటిల్ కూడా కనిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వీడియోను చూడండి..

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

ప్రపంచంలోనే అతిపెద్ద పాము రెటిక్యులేటెడ్‌ పైథాన్.. ఇది అదేనని పేర్కొంటున్నారు. దక్షిణ, ఆగ్నేయ ఆసియాలో ఈ పాము కనిపిస్తుందని పేర్కొంటున్నారు. నెట్టిజన్లు దీన్ని చూసి హడలెత్తిపోతున్నారు. నిజంగా ఇది పామేనా.. లేక గ్రాఫిక్సా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..