Viral Video: ఒకరిది ఆకలి తీర్చుకోవడనికి ఆరాటం.. మరొకదారి ప్రాణాల కోసం పోరాటం.. వీడియో వైరల్..

| Edited By: Vimal Kumar

Sep 05, 2023 | 3:55 PM

వైరల్ అవుతున్న వీడియోలో గేట్ వద్ద ఒక పాము కప్పను నోట కరుచుకుంది. ఆ కప్పను తన వైపుకు లాగడానికి పాము ప్రయత్నిస్తుండగా..  కప్ప తన ప్రాణాలను కాపాడుకోవడానికి పైకి ఎక్కుతోంది. ఇలా కప్పు పైకి ఎక్కుతూ ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలో పాము పట్టు కొన్ని సెకన్ల పాటు సడలినట్లు ఉంది.  కప్పపై తన పట్టును వదిలింది.

Viral Video: ఒకరిది ఆకలి తీర్చుకోవడనికి ఆరాటం.. మరొకదారి ప్రాణాల కోసం పోరాటం.. వీడియో వైరల్..
Viral Video
Follow us on

ప్రకృతిలో అనేక రంగులు.. అనేక వింతలు ఉన్నాయి. అయితే కొన్ని వింతలను చూస్తుంటే వాటిని చూసి మనం అనేక విషయాలను నేర్చుకునే అవకాశాన్ని కూడా ఇస్తాయి. వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ కావడానికి ఇదే కారణం. ఈ వీడియోలు ఒక్కోసారి మనల్ని నవ్వించేలా ఉంటే, మరికొన్ని ఆలోచింపజేసేవిలా ఉంటాయి. తెరపైకి వచ్చే కొన్ని రకాల వీడియోలను చూస్తే జనాలు అవాక్కవుతూ ఉంటారు. అయితే ఇవి కాకుండా మనకు జ్ఞానాన్ని అందించే వీడియోలు కూడా చాలా ఉంటూనే ఉన్నాయి. ఇవి చూస్తే ఏ పుస్తకం మనకు బోధించలేదు అనిపిస్తుంది ఎవరికైనా.. అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన తర్వాత జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా.. ప్రాణాలు పోగొట్టుకునే స్టేజ్ లో ఉన్నా జీవితంపై ఆశలు వదులుకోకూడదని ఎవరికైనా అర్థమవుతుంది.

పాము విషపూరితమైన ప్రమాదకరమైన జీవి. తాను పట్టుకున్న ఎరను ఎప్పటికీ వదలదు. అంతేకాదు తన ఎరను చాలా వేగంగా పట్టుకుంటుంది.. అంతేకాదు ఆ ఎర పాము నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అవుతుంది. ఇప్పుడు వైరల్ అవుతున్న  వీడియోలో ఒక పాము కప్పను తన వేటాడేందుకు రెడీ అయింది,

ఇవి కూడా చదవండి

 

వైరల్ అవుతున్న వీడియోలో గేట్ వద్ద ఒక పాము కప్పను నోట కరుచుకుంది. ఆ కప్పను తన వైపుకు లాగడానికి పాము ప్రయత్నిస్తుండగా..  కప్ప తన ప్రాణాలను కాపాడుకోవడానికి పైకి ఎక్కుతోంది. ఇలా కప్పు పైకి ఎక్కుతూ ప్రాణాల కోసం పోరాడుతున్న సమయంలో పాము పట్టు కొన్ని సెకన్ల పాటు సడలినట్లు ఉంది.  కప్పపై తన పట్టును వదిలింది. తనకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కప్ప గబగబా పాము నోటి నుంచి విడిపించుకుని గెట్ పైకి ఎక్కి పారిపోయింది. అప్పుడు ఆ కప్పని పాము చూస్తూ ఉండిపోతుంది.

ఈ వీడియో @TheeDarkCircle అనే ఖాతా ద్వారా X (Twitter)లో షేర్ చేశారు. ఇప్పటి వరకూ 1.84 వేల మందికి పైగా చూశారు. అంతేకాదు అనేక మంది రకరకాల కామెంట్స్ చేశారు. ‘కష్ట సమయాల్లో ధైర్యంగా వ్యవహరించాలి’ అని రాశారు. అదే సమయంలో, మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు, ‘తప్పించుకోవడానికి అవకాశం కోసం మాత్రమే అన్వేషణ ఉంది.. అయితే దానిని మనం సరైన సమయంలో కనుగొనవలసి ఉంటుందని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..