Optical Illusion: దమ్ముంటే కాస్కో.. అమ్మాయి ఉన్న ఈ ఫొటోలో నాలుగు ముఖాలున్నాయి.. గుర్తుపట్టగలరా..?

|

Mar 27, 2023 | 1:13 PM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు.. తికమకపెడుతుంటాయి. అయితే, ఆ ఫొటోల్లో చూడటానికి ఏం లేనట్టు కనిపిస్తూనే మన కళ్లను మోసం చేసేలా దర్శనమిస్తుంటాయి.

Optical Illusion: దమ్ముంటే కాస్కో.. అమ్మాయి ఉన్న ఈ ఫొటోలో నాలుగు ముఖాలున్నాయి.. గుర్తుపట్టగలరా..?
Optical Illusion
Follow us on

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు.. తికమకపెడుతుంటాయి. అయితే, ఆ ఫొటోల్లో చూడటానికి ఏం లేనట్టు కనిపిస్తూనే మన కళ్లను మోసం చేసేలా దర్శనమిస్తుంటాయి. అందుకే చాలా మంది ఆప్టికల్ ఇల్యూషన్స్, పజిల్స్‌, ఐక్యూ టెస్ట్ లను ఇష్టపడుతుంటారు. కష్టమైన పజిల్స్‌తో మీ మెదడుకు ఎంత వ్యాయామం చేస్తే.. అంత తెలివిగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆప్టికల్ భ్రమలు ఎల్లప్పుడూ మన మెదడు ఎలా పనిచేస్తుందనే దానిపై కొన్ని మనోహరమైన అంతర్దృష్టిని అందిస్తాయి. రంగు, కాంతి, నమూనాల నిర్దిష్ట కలయికలు మన మెదడును దృశ్యమానంగా గ్రహించేలా చేస్తాయి. తాజాగా అలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే.. లేడీ ఉన్న ఈ చిత్రంలో నాలుగు ముఖాలు దాగున్నాయి. కనిపెట్టడం కొంచెం కష్టమే.. అయినా ప్రయత్నిస్తే తప్పక గుర్తించవచ్చు.

పై చిత్రం పిల్లలు, పెద్దలు వారి మెదడు శక్తిని పరీక్షించడానికి ఒక గమ్మత్తైన పజిల్‌గా ఉద్భవించింది. ఈ ఆప్టికల్ భ్రమలో ఒక మహిళ తన తోటలో నిలబడి ఉంది. గార్డెన్‌లో పచ్చని గడ్డి మధ్య అందమైన వాటర్ ఫౌంటెన్ ఉంది. అయితే, మహిళ తన తోటలో నలుగురు చొరబాటుదారుల కోసం వెతుకుతోందంటూ క్యాప్షన్ ఇచ్చారు.

ఇంకెందుకు ఆలస్యం ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో దాగి ఉన్న నాలుగు ముఖాలను గుర్తించండి..

Iq Test

అయితే, లేడీస్ గార్డెన్‌లో దాగి ఉన్న నాలుగు ముఖాలను కేవలం 1% మంది మాత్రమే కనుగొన్నట్లు పేర్కొంటున్నారు. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ మీ IQని పరీక్షించడానికి ఒక మంచి మార్గం. ట్విస్ట్ ఏమిటంటే మీరు 15 సెకన్లలో ఈ 4 ముఖాలను గుర్తించాల్సి ఉంటుంది. ట్రై చేయండి..

ఇవి కూడా చదవండి

ఇంకా ఈ చిత్రంలో నాలుగు ముఖాలను గుర్తించకపోతే.. మీరు చిత్రాన్ని నిలువుగా, అడ్డంగా చూడండి.. నీటి ఫౌంటెన్ నిర్మాణంలో 4 ముఖాలు దాగి ఉంటాయి. లేకపోతే.. ఈ కింద ఇచ్చిన ఫొటోను చూడండి..

Iq Test1

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..