True Love Video: నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో..? ఈ వీడియోనే సాక్షమంటున్న నెటిజన్లు..!

తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది.. ఈ వైరల్‌ క్లిప్‌లో నిజమైన ప్రేమ ఉందని గ్రహించి చాలా మంది నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. వీడియోలో రోడ్డుపక్కన అమ్ముతున్న కూల్‌డ్రింక్‌ తాగేందుకు ఆగిన ఒక వృద్ధుడు.. తానూ తాగే ముందు ఏం చేశాడో చూసిన చాలా మంది ఉద్వేగానికి గురవుతున్నారు.

True Love Video: నిజమైన ప్రేమ అంటే ఇదేనేమో..? ఈ వీడియోనే సాక్షమంటున్న నెటిజన్లు..!
True Love
Follow us
Jyothi Gadda

|

Updated on: May 26, 2023 | 3:35 PM

సోషల్ మీడియా ఒక అద్భుతమైన ప్రపంచం. ఇక్కడ మీరు దేశీ జుగాద్ నుండి జీవితంలో జరిగే అనేక సంఘటనలు మొదలు.. ఎన్నో మధుర క్షణాల వరకు వీడియోలను ఇక్కడ చూస్తుంటాం. అలాంటి వీడియోలు కొన్ని మన ముఖంలో చిరునవ్వు తెప్పించేవిగా ఉంటే, మరి కొన్నిసార్లు అవి మన హృదయాన్ని బాధపెట్టేవిగా ఉంటాయి. కొన్ని కొన్న వీడియోలు ఆశ్చర్యపోయేలా చేస్తుంటాయి. కొన్నిసార్లు ఇక్కడ కొంతమంది వ్యక్తులు షేర్‌ చేసే వీడియోలు చూసేవారిని కూడా కన్నీళ్లు పెట్టించేవిగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ వీధుల్లో చక్కర్లు కొడుతోంది.. ఈ వైరల్‌ క్లిప్‌లో నిజమైన ప్రేమ ఉందని గ్రహించి చాలా మంది నెటిజన్లు భావోద్వేగానికి గురయ్యారు. వీడియోలో రోడ్డుపక్కన అమ్ముతున్న కూల్‌డ్రింక్‌ తాగేందుకు ఆగిన ఒక వృద్ధుడు.. తానూ తాగే ముందు ఏం చేశాడో చూసిన చాలా మంది ఉద్వేగానికి గురవుతున్నారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో రోడ్డు పక్కన ఉన్న దుకాణం నుండి ఒక వృద్ధుడు షర్బత్ తీసుకుంటూ కనిపించాడు. అతను తన సైకిల్‌పైనే నిలబడి ఉన్నాడు. ఒక చేతిలో అతని దివంగత భార్య ఫోటో ఉంది. అతను షర్బత్ తాగే ముందు, గ్లాసుని భార్య ఫోటోకి చూపించాడు. ఆ తర్వాత అతను తాగడం మొదలుపెట్టాడు. చపోయిన తర్వాత కూడా భార్యపై అతను చూపించిన ప్రేమకు అందరూ ఫిదా అయిపోతున్నారు. చాలా మంది ఈ వీడియో చూసి భావోద్వేగానికి గురవుతున్నారు. నిజమైన ప్రేమ అంటే ఇదే కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నిజమైన ప్రేమ అంటే ఏమిటి అని ఎవరైనా నన్ను అడిగినప్పుడు, నేను ఈ అందమైన క్లిప్‌ను చూపిస్తాను.. అంటూ నెటిజన్ ఒకరు కామెంట్ చేయగా, ఈ అనుభూతిని మాటల్లో చెప్పాలంటే మాకు పదాలు రావటం లేదంటూ మరికొందరు కామెంట్‌ చేశారు. ఈ క్లిప్‌ని చూసిన తర్వాత చాలా మంది వినియోగదారులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోని గుర్పిందర్ సంధు అనే వినియోగదారు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. కాగా, ఈ వీడియోకి 2 మిలియన్లకు పైగా వ్యూస్‌తో మరింత వైరల్‌ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..