Trending Video: మైకేల్ జాక్సన్ పాటకు ఆటోవాలాల అదిరిపోయే స్టెప్పులు.. సాహో అంటున్న నెటిజన్లు..

'ట్యాలెంట్ అనేది ప్రదర్శించేది కాదు.. అవసరాన్ని బట్టి అదే బయటకు వస్తుంది..' ఇదీ.. ఓ సూపర్ హిట్ సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్. నిజమే.. ట్యాలెంట్ అనేది ఓ ఒక్కరి సొత్తు కాదు. ఈ భూమిపై నివాసముంటున్న ప్రతి...

Trending Video: మైకేల్ జాక్సన్ పాటకు ఆటోవాలాల అదిరిపోయే స్టెప్పులు.. సాహో అంటున్న నెటిజన్లు..
Auto Driver Dancing
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 19, 2022 | 11:54 AM

‘ట్యాలెంట్ అనేది ప్రదర్శించేది కాదు.. అవసరాన్ని బట్టి అదే బయటకు వస్తుంది..’ ఇదీ.. ఓ సూపర్ హిట్ సినిమాలోని పవర్ ఫుల్ డైలాగ్. నిజమే.. ట్యాలెంట్ అనేది ఓ ఒక్కరి సొత్తు కాదు. ఈ భూమిపై నివాసముంటున్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ దాగి ఉంటుంది. అయితే.. వారు దానిని నిరూపించేందుకు అవసరమైన వేదిక అవసరమవుతుంది. కానీ ఎప్పుడైతే సోషల్ మీడియా వినియోగం పెరిగిందో.. అప్పటి నుంచి ట్యాలెంట్ ఉన్న వారి లైఫ్ స్టైల్ మారిపోయిందని చెప్పవచ్చు. సింగింగ్, డ్యాన్సింగ్, కుకింగ్, ఫన్నీ స్కిట్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుంటాయి. ప్రస్తుతానికి ఇద్దరు వ్యక్తులు చేస్తున్న బ్రేక్ డ్యాన్స్ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. ఇద్దరు ఆటోరిక్షా డ్రైవర్లు రోడ్డు పక్కన ‘బ్రేక్ డ్యాన్స్’ చేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ పాడిన ‘డేంజరస్’ పాట కు వారు వేసిన స్టెప్పులు చూస్తుంటే మనకూ లేచి గంతులేయాలనిపించక మానదు. డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆ ఇద్దరు ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చూస్తే ఫిదా అవని వారు ఉండరేమో. అంతే కాకుండా వారిద్దరూ డ్యాన్స్ మూమెంట్స్ ను చూపిస్తూ చేస్తుండటం విశేషం.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటివరకు 9 లక్షలకు పైగా వ్యూస్, వేలకు పైగా లైక్స్ వస్తున్నాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తూ తమ ప్రేమను కురిపించారు.దేశీ జాక్సన్ అని పిలుస్తున్నారు. వీరిని స్ట్రీట్ లోనే మిగిలిపోయిన నిజమైన డ్యాన్సర్స్ అని తమ అభిప్రాయాలను రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి