Telangana: తుమ్మలను బుజ్జగించే పనిలో బీఆర్‌ఎస్‌.. ఆ నేతకు బాధ్యతలు.. ఈరోజు రాత్రికి డిన్నర్.. ఇంట్లోనే బస..

తెలంగాణ రాజకీయం మొత్తం గత కొద్దిరోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ తిరుగుతోంది. జిల్లాకు చెందిన ఇద్దరు కీలకనేతలు పార్టీపై బీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్నారన్న చర్చ సాగుతోంది. అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్తారన్న సంకేతాల నేపథ్యంలో....

Telangana: తుమ్మలను బుజ్జగించే పనిలో బీఆర్‌ఎస్‌.. ఆ నేతకు బాధ్యతలు.. ఈరోజు రాత్రికి డిన్నర్.. ఇంట్లోనే బస..
Minister Harish Rao, Tummala Nageswara Rao
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 11, 2023 | 10:48 PM

తెలంగాణ రాజకీయం మొత్తం గత కొద్దిరోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ తిరుగుతోంది. జిల్లాకు చెందిన ఇద్దరు కీలకనేతలు పార్టీపై బీఆర్‌ఎస్‌పై అసంతృప్తితో ఉన్నారన్న చర్చ సాగుతోంది. అయితే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్తారన్న సంకేతాల నేపథ్యంలో.. ఉమ్మడి ఖమ్మంలో పార్టీ బలాన్ని నింపుకునేందుకు.. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును బుజ్జగించే పనిలో పడ్డారు కేసీఆర్‌. దీనిలో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని నేతల బృందం వెళ్లింది. ట్రబుల్ షూటర్‌గా పేరుపొందిన మంత్రి హరీశ్ రావు తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి వెళ్లడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పాలేరు నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తుమ్మల భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆత్మీయ సమ్మేళనం కూడా పెట్టారు. 12వ తేదీన కొత్తగూడెంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సభ జగరనుంది. అలాగే ఈ నెల 18న ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరగనుంది. బీఆర్ఎస్‌ సభను విజయవంతం చేసేందుకే హరీశ్ రావు .. తుమ్మల ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. దమ్మపేట మండలంలోని గండుగలపల్లిలో వున్న తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి మంత్రి హరీశ్ రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెళ్లారు. ఇలా ఉండగా ఖమ్మం జిల్లాలోని బీఆర్‌ఎస్‌ నేతలు ఇటీవల త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డంతో పాటు కొత్త సంవ‌త్స‌రం వేళ త‌మ బ‌ల‌నిరూప‌ణ చ‌ర్య‌ల‌కు దిగ‌డం, నేత‌ల వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి.

ప్ర‌స్తుతం ఆయా నాయ‌కుల తీరును గ‌మ‌నిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు ద‌క్క‌కుంటే పార్టీ గుడ్ బై చెప్ప‌డానికి సైతం సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది. ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేతలు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, లోక్‌సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్లు రాని పక్షంలో పార్టీని వీడే సూచనలు కనిపిస్తున్నాయి.

మరోవైపు పొంగులేటి పార్టీని వీడతారని స్పష్టం కావడంతో.. తుమ్మలను కాపాడుకునే పనిలో కేసీఆర్‌ పడినట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు గనుక పార్టీ వీడితే జిల్లాలో బీఆర్‌ఎస్‌ బలహీనపడుతుందనే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ట్రబుల్‌ షూటర్‌ హరీష్‌రావును కేసీఆర్‌ రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. హరీష్‌రావుతో పాటు సండ్ర వెంకటవీరయ్య కూడా తుమ్మల ఇంటికి వెళ్లారు. అయితే ఇటీవల సండ్ర వెంకటవీరయ్య.. తుమ్మలపై పరోక్ష విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..