Telangana: సింగరేణీ ప్రైవేటీకరణపై ఇక యుద్ధమే.. మోదీ తెలంగాణకు వచ్చే రోజే ఆందోళనకు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్‌.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమైంది. సింగరేణి ప్రైవేటీకరణపై పోరుబాట పట్టనుంది. ఇందులో భాగంగానే కేంద్రంలోని బీజేపీ సర్కారుపై జంగ్ సైరన్ మోగించింది. బొగ్గు బ్లాకుల వేలంపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు...

Telangana: సింగరేణీ ప్రైవేటీకరణపై ఇక యుద్ధమే.. మోదీ తెలంగాణకు వచ్చే రోజే ఆందోళనకు పిలుపునిచ్చిన బీఆర్‌ఎస్‌.
Brs Vs Bjp
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 06, 2023 | 5:26 PM

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమైంది. సింగరేణి ప్రైవేటీకరణపై పోరుబాట పట్టనుంది. ఇందులో భాగంగానే కేంద్రంలోని బీజేపీ సర్కారుపై జంగ్ సైరన్ మోగించింది. బొగ్గు బ్లాకుల వేలంపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే అదే రోజు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వస్తుండడం ఆసక్తికరంగా మారింది.

ఈనెల 8న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తర్వాత పరేడ్‌గ్రౌండ్స్‌ సభలో పాల్గొంటారు. సరిగ్గా అదే రోజు జంగ్‌ సైరన్ మోగిస్తోంది బీఆర్‌ఎస్‌. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఏప్రిల్‌ 8న మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం కేంద్రాల్లో మహా ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు.

సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12న రామగుండంలో ఇచ్చిన మాటను ప్రధాని తప్పారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. యూ టర్న్ తీసుకున్న కేంద్రానికి ప్రజాక్షేత్రంలోనే గుణపాఠం చెపుతామని హెచ్చరించారు. వేలం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరి ఏప్రిల్‌ 8వ తేదీన రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..