Telangana: నా బతుకు నేను బతుకుతా.. నన్ను వెతకొద్దు.. బాలుడు ఎస్కేప్
హైదరాబాద్‌లోని ఓ కుర్రోడు విచిత్రంగా ఆలోచించి ఇంటినుంచి పరారయ్యాడు. నా బతుకు నేను బతుకుతా.. నా గురించి వెతకొద్దు.. గుడ్ బై అని రాసిన లేఖ ఆశ్చర్యం కలిగిస్తోంది.
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఓ బాలుడు ఇంటి నుంచి పరారయ్యాడు. నేరేడ్‌మెట్ పరిధిలోని అంతయ్య కాలనీలో నివాసముండే పదిహేనేళ్ల తులసికుమార్.. లాల్‌బజార్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. అయితే.. ఇంట్లో ఏం జరిగిందో తెలియదు కానీ.. ఉదయం ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు.
నా బతుకు నేను బతుకుతాను.. నా గురించి వెతక్కండి.. గుడ్ బై అంటూ తులసికుమార్ ఓ లెటర్ రాసి ఇంట్లో నుంచి జంప్ కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికి.. ఆచూకీ లభించకపోవడంతో నేరేడ్‌మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. తులసికుమార్ కోసం వెతుకులాట సాగిస్తున్నారు.
పిల్లలను కాస్త తల్లిదండ్రలు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. కౌమార దశలో వారు ట్రాక్ తప్పే అవకాశం ఉంటుంది. సరైన కేర్ తీసుకోకపోతే ఇలాంటి ఇన్సిడెంట్సే ఎదురవుతాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..