సీతారాముల కల్యాణం చూతమురారండి.. మరికాసేపట్లో ఎదుర్కోలు ఉత్సవం.. ముస్తాబయిన భద్రాద్రి

రేపటి సీతారాముల కల్యాణం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు కలెక్టర్ అనుదీప్. 

సీతారాముల కల్యాణం చూతమురారండి.. మరికాసేపట్లో ఎదుర్కోలు ఉత్సవం.. ముస్తాబయిన భద్రాద్రి
Bhadrachalam All Decked
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 29, 2023 | 6:21 PM

దక్షిణ అయోధ్య.. సీతారాములవారి కల్యాణానికి భద్రాద్రి రామాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మార్చి 30 గురువారం రోజున అభిజిత్ లగ్నంలో భద్రాచలం మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. వీఐపీలు ,భక్తులు కల్యాణాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.

ఇవాళ సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం తర్వాత గరుడ వాహనసేవ, రేపు సీతారాముల కల్యాణం, ఎల్లుండి రామయ్య పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రతి 12 ఏళ్లకు ఒక్కసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. ఈసారి పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై హాజరవుతున్నారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 2000 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ఇద్దరు అడిషనల్ ఎస్పీ లతో పాటు 16 మంది DSPలు.. 54 మంది CI లు.. 270 మంది ఆఫీసర్స్ తో పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. 7 ప్రదేశాలలో పార్కింగ్ కి ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

రేపటి సీతారాముల కల్యాణం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు కలెక్టర్ అనుదీప్. పర్ణశాలలో నవమి ఏర్పాట్లను కలెక్టర్‌ అనుదీప్‌ మంగళవారం పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. గవర్నర్‌ పర్యటన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సీఐకు సూచించారు. 24 గంటలు తాగునీటి ఏర్పాట్లుండాలని సూచించారు. తలంబ్రాలు, ప్రసాదం కౌంటర్లు సరిపడా ఏర్పాటు చేసి తొక్కిసలాట జరగకుండా చూడాలని అన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం..