Samsung F 14: సామ్‌సంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి గెలాక్సీ ఎఫ్ 14.. మతిపోయే ఫీచర్స్‌తో అద్భుతమైన డిజైన్..
గెలాక్సీ ఎఫ్ 14 పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్‌లో వచ్చే వారం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో ఇచ్చే ఫీచర్ల వల్ల ఈ ఫోన్ వినియోగదారుల మనస్సును గెలుచుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఫోన్ 5జీ సపోర్ట్‌తో వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారత్‌లో ఉన్న విస్తృతమైన స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తమ ప్రాభవాన్ని నిలుపుకునేందుకు సామ్‌సంగ్ కంపెనీ సరికొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గెలాక్సీ ఎఫ్ 14 పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్‌లో వచ్చే వారం నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో ఇచ్చే ఫీచర్ల వల్ల ఈ ఫోన్ వినియోగదారుల మనస్సును గెలుచుకుంటుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఫోన్ 5జీ సపోర్ట్‌తో వస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్చి 24 మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ బుకింగ్ విండో ఓపెన్ అవుతుంది. సామ్‌సంగ్ స్టోర్లతో పాటు ఫిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఎక్సినోస్ చిప్‌సెట్‌తో వచ్చే ఈఫోన్‌లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని కంపెనీ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే ఈ ఫోన్ ధర విషయం ఇంకా వెల్లడించనప్పటికీ ఈ ఫోన్ 15 వేల రూపాయల కంటే తక్కువ ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ ఫోన్ 6జీబీ+128 జీబీ వేరింట్ ధర మాత్రం రూ.17,999గా ఉంటుందని పేర్కొంటున్నాయి. అయితే లీక్స్ ప్రకారం చూసుకుంటే ఈ ఫోన్ ధర ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో వచ్చే ఇతర ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.
సామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 14 5జీ స్పెసిఫికేషన్లు ఇవే..
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో సామ్‌సంగ్ వన్ యూఐ 5.0 సపోర్ట్
- రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్ హామీతో పాటు నాలుగేళ్ల పాటు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ఫీచర్
- ఎక్సినోస్ చిప్ సెట్ 1330తో సామ్‌సంగ్ ర్యామ్ ప్లస్ సపోర్ట్
- 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఓ సారి చార్జ్ చేస్తే రెండు రోజుల బ్యాటరీ లైఫ్
- 50 ఎంపీ కెమెరాతో పాటు 2 ఎంపీ సెకండరీ సెన్సార్ కెమెరా
- 13 ఎంపీ సెల్ఫీ కెమెరా
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..