IPL 2023: ఐపీఎల్‌కు MS Dhoni రిటైర్మెంట్ ఎప్పుడు? సూటిగా సమాధానం చెప్పేసిన రోహిత్ శర్మ

IPL 2023 News: అంతర్జాతీయ క్రికెట్‌లో ఐపీఎల్ మినహా మిగిలిన అన్ని ఫార్మట్లకు ధోనీ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించేశారు. మరో రెండ్రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-16 సీజన్ ధోనీకి చివరిదని.. ఈ టోర్నీ తర్వాత ఆయన ఐపీఎల్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

IPL 2023: ఐపీఎల్‌కు MS Dhoni రిటైర్మెంట్ ఎప్పుడు? సూటిగా సమాధానం చెప్పేసిన రోహిత్ శర్మ
MS Dhoni, Rohit Sharma (File Photo)Image Credit source: Social Media
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 29, 2023 | 2:38 PM

ఎం.ఎస్.ధోనీ ఐపీఎల్‌కు ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటిస్తారు? క్రికెట్ అభిమానుల మధ్య చాలా కాలంగా ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. అటు మీడియా వర్గాల్లోనూ ధోనీ రిటైర్మెంట్ ఇప్పుడు.. అప్పుడన్న ప్రచారం గత మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఐపీఎల్ మినహా మిగిలిన అన్ని ఫార్మట్లకు ధోనీ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించేశారు. మరో రెండ్రోజుల్లో ప్రారంభంకానున్న ఐపీఎల్-16 సీజన్ ధోనీకి చివరిదని.. ఈ టోర్నీ తర్వాత ఆయన ఐపీఎల్‌ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో 41 ఏళ్ల కెప్టెన్ కూల్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ధోనీ రిటైర్మెంట్‌పై జరుగుతున్న ఊహాగానాలు అతని ఫ్యాన్స్‌‌కు కాస్త ఆందోళన కలిగిస్తోంది. ఇంకా రెండు మూడు సీజన్ల పాటు ధోనీ ఐపీఎల్‌లో కొనసాగాలని వారు కోరుకుంటున్నారు. గత ఐపీఎల్‌ తర్వాత ఎక్కడా క్రీజులో కనిపించని ధోనీ.. తొలిసారిగా వచ్చే ఐపీఎల్ తొలి రోజు ఆటలో అడుగుపెట్టనున్నారు. ఇదే విషయమై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సూటిగా సమాధానమిచ్చారు. ధోనీ మరో రెండు మూడేళ్ల పాటు గ్రాండ్ లీగ్‌లో కొనసాగే అవకాశముందని అభిప్రాయపడ్డారు.

గత రెండుమూడేళ్లుగా ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయని రోహిత్ శర్మ గుర్తుచేశారు. అయితే ధోనీ పూర్తిగా ఫిట్‌గా ఉన్నారని.. మరికొన్ని సీజన్ల పాటు ఐపీఎల్‌లో కొనసాగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ధోనీ రిటైర్మెంట్‌పై హిట్ మ్యాన్ చేసిన కామెంట్స్ పట్ల ధోనీ ఫ్యాన్స్, సీఎస్కే అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తంచేస్తున్నారు. మరికొన్ని సీజన్లు ఐపీఎల్‌లో కొనసాగే సత్తా ధోనీకి ఉందంటున్నారు.

ఐపీఎల్ 16వ సీజన్ ఈ నెల 31న ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో తన తొలి మ్యాచ్‌‌లో రాయల్ ఛాలెంజ్స్ బెంగళూరును రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఢీకొంటుంది. ఈ మ్యా్చ్ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఏప్రిల్ 2న జరగనుంది.

మరిన్ని ఐపీఎల్ వార్తలు చదవండి