Video: WPL ఫైనల్‌కు ముందే సంచలనం.. టోర్నీలో తొలి హ్యాట్రిక్‌తో సత్తా చాటిన 20 ఏళ్ల బౌలర్.. వైరల్ వీడియో

|

Mar 24, 2023 | 10:45 PM

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ముగియకముందే సంచలన రికార్డు ఒకటి నమోదైంది. టోర్నీ తొలి సీజన్ ఫైనల్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ ఈజీ వాంగ్ చరిత్ర సృష్టించింది.

Video: WPL ఫైనల్‌కు ముందే సంచలనం.. టోర్నీలో తొలి హ్యాట్రిక్‌తో సత్తా చాటిన 20 ఏళ్ల బౌలర్.. వైరల్ వీడియో
Issy Wong Hat Trick
Follow us on

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ముగియకముందే సంచలన రికార్డు ఒకటి నమోదైంది. టోర్నీ తొలి సీజన్ ఫైనల్‌కు ముందు ముంబై ఇండియన్స్ ఫాస్ట్ బౌలర్ ఈజీ వాంగ్ చరిత్ర సృష్టించింది. ఈ ఇంగ్లండ్ పేసర్ డబ్ల్యూపీఎల్‌లో తొలి హ్యాట్రిక్ సాధించి భయాందోళనలు సృష్టించింది. యూపీ వారియర్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ ఆడుతోంది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో ఈ యువ ఫాస్ట్ బౌలర్ ఈ అద్భుత ఫీట్ చేసి రికార్డు పుస్తకాల్లో తన పేరును శాశ్వతంగా లిఖించుకుంది.

ముంబై ఇండియన్స్‌కు చెందిన ఇంగ్లిష్ పేసర్ యూపీ వారియర్స్‌పై 13వ ఓవర్‌లో వరుసగా 3 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..