IPL 2023: పంత్ స్థానంలో బరిలోకి దిగనున్న మాజీ కోహ్లీ‌మేట్.. అతడెవరో తెలుసా?

|

Mar 24, 2023 | 8:30 PM

ఐపీఎల్ 2023 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఔట్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన కారు ప్రమాదంలో..

IPL 2023: పంత్ స్థానంలో బరిలోకి దిగనున్న మాజీ కోహ్లీ‌మేట్.. అతడెవరో తెలుసా?
Rishabh Pant
Follow us on

ఐపీఎల్ 2023 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఔట్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది జరిగిన కారు ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటున్న అతడు.. మరో ఐదు లేదా ఆరు నెలలు ఆటకు పూర్తిగా దూరం కానున్న విషయం విదితమే. ఈ తరుణంలో సీజన్ మొత్తానికి పంత్ దూరం కావడంతో.. కెప్టెన్‌గా ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వ్యవహరించనున్నాడు. ఇక పంత్ స్థానంలో మరో విధ్వంసకర వికెట్ కీపర్‌ను తీసుకునే ప్రయత్నాలు చేస్తోంది ఢిల్లీ ఫ్రాంచైజీ.

ప్రస్తుతం ఢిల్లీ జట్టులో ఫిల్ సాల్ట్ మినహా వికెట్ కీపర్ మరెవ్వరూ లేరు. అతడికి గాయం అయినా.. మరో వికెట్ కీపర్ జట్టులో ఉండాలన్న ఉద్దేశంతో పంత్ స్థానాన్ని కేరళ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్ అజారుద్దీన్‌తో భర్తీ చేయాలని ఢిల్లీ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. దేశవాళీ క్రికెట్‌లో పలు విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు అజారుద్దీన్‌ పెట్టింది పేరు. లోయార్డర్‌లో జట్టుకు మంచి ఫినిషర్‌గా ఉపయోగపడతాడు. అలాగే ఈ 28 ఏళ్ల బ్యాటర్ ఐపీఎల్‌-2022లో ఆర్సీబీకు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఆ సీజన్‌లో మనోడికి అవకాశాలు ఏం రాలేదు. ఇక అజారుద్దీన్‌ను ఐపీఎల్ 2023 మినీ వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోవడంతో.. పంత్‌ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోనున్నట్లు తెలుస్తోంది.