డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2016లో తొలి ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది . అయితే దీని తర్వాత ఆ జట్టు మళ్లీ ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేకపోయింది. గత సీజన్‌లో, ఈ ఫ్రాంచైజీ వార్నర్‌ను తొలగించి, కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా చేసింది, కానీ ఈ న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ అద్భుతాలేమీ చేయలేకపోయాడు. దీంతో కేన్‌మామకు కూడా జట్టు గుడ్‌బై చెప్పింది. IPL-2023 వేలంలో హైదరాబాద్ ఫ్రాంచైజీ కొత్త ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో మయాంక్ అగర్వాల్ ఒకరు. 8.25 కోట్లకు మయాంక్‌ను ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. సన్‌రైజర్స్‌కు కొత్త కెప్టెన్ రేసులో మయాంక్ పేరే ముందుంది. అతనితో పాటు ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ హైదరాబాద్ జట్టులో చేరాడు. అతని కోసం ఫ్రాంచైజీ ఏకంగా రూ.13.50 కోట్లు వెచ్చించింది. దీంతోపాటు దక్షిణాఫ్రికాకు చెందిన హెన్రిచ్ క్లాసెన్‌ను కూడా చేర్చుకోవడం ద్వారా జట్టుకు మరింత బలం చేకూరింది. హ్యారీ బ్రూక్, క్లాసెన్ రాక జట్టు మిడిల్ ఆర్డర్‌కు బలం చేకూరుస్తుంది. మయాంక్ అగర్వాల్‌తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. గత ఐపీఎల్ సీజన్‌లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన రాహుల్ త్రిపాఠి ఈ సీజన్‌లో కూడా రాణించాలని ఆ జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అతను నంబర్-3లో ఆడటం ఖాయం. బ్రూక్ అతని తర్వాత రావచ్చు, ఆపై ఐడెన్ మార్క్రామ్ ఆడటం ఖాయం.
దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఫినిషర్ పాత్రను పోషించనున్నాడు. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ వేగంగా పరుగులు సాధించగలడు. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఏడో నంబర్‌లో బ్యాటింగ్ చేయగలడు. ఈ యువ ఆటగాడికి ఆఫ్ స్పిన్‌తో పాటు భారీ షాట్లు కొట్టగలిగే సామర్థ్యం ఉంది. ఇక బౌలింగ్ విషయానికొస్తే.. జట్టులోని అనుభవజ్ఞులైన ఆటగాళ్లలో ఒకరైన భువవేశ్వర్ కుమార్ ఫాస్ట్ బౌలింగ్ అటాక్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఉమ్రాన్ మాలిక్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ టి.నటరాజన్ అతనికి మద్దతు ఇస్తారు. కాగా గత సీజన్‌లో ఆ జట్టుకు మంచి స్పిన్నర్లు లేరు. ఈసారి ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్‌ను కొనుగోలు చేయడం ద్వారా ఫ్రాంచైజీ ఈ లోటును తీర్చే ప్రయత్నం చేసింది. అతని ప్లే-11లో భాగం కావాలని కూడా నిర్ణయించారు.
మయాంక్ అగర్వాల్ , అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, హ్యారీ బ్రూక్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, ఆదిల్ రషీద్, టి.నటరాజన్, ఉమ్రాన్ మాలిక్.
Our Batters for 2023 ? pic.twitter.com/xSi7SOwCTC
— SunRisers Hyderabad (@SunRisers) December 24, 2022
Can get the job done with both, the bat and the ball ? pic.twitter.com/yUOLyKc96t
— SunRisers Hyderabad (@SunRisers) December 24, 2022
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..