ODI World Cup 2023: ప్రపంచ కప్ 2011 గెలిచిన తర్వాత, భారత క్రికెట్ జట్టు మరే ఇతర ప్రపంచ కప్‌ను గెలుచుకోలేకపోయింది. ఈ మధ్యలో 50 ఓవర్ల ఫార్మాట్లో 2 ప్రపంచ కప్‌లు జరిగాయి. రెండింటిలోనూ సెమీ-ఫైనల్లో ఓడి భారత్ నిష్క్రమించింది. 2019లో జరిగిన చివరి వన్డే ప్రపంచకప్‌లో, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడి భారత్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. ఆ ప్రపంచకప్‌లో భారత్‌కు అతిపెద్ద సమస్య నంబర్-4. నాల్గవ నంబర్లో బ్యాటింగ్ చేయడానికి భారతదేశానికి ప్రత్యేకమైన బ్యాట్స్‌మన్ ఎవరూ లేరు. ఈసారి అంటే 2023 వన్డే ప్రపంచ కప్‌లో కూడా అదే సమస్య టీమిండియా ముందు కనిపిసతోంది. అయితే, బీసీసీఐ కొత్త కాంట్రాక్ట్ జాబితాను పరిశీలిస్తే, 2023లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో 4వ నంబర్లో బ్యాటింగ్‌కు సంజూ శాంసన్.. ఈ సమస్యను పరిష్కరించగలడని తెలుస్తోంది. దీనికి కొన్ని కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
వన్డే జట్టులో సంజూ శాంసన్‌కు శాశ్వత స్థానం దక్కాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ నిపుణులు, అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడంపై జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు BCCI తన వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో మొదటిసారిగా సంజూ శాంసన్‌ను చేర్చుకుంది. దీంతో వన్డే క్రికెట్ జట్టులో సంజుకు స్థానం ఇవ్వగలదని సూచిస్తుంది. బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో సంజూ శాంసన్ గ్రేడ్-సి కేటగిరీలో చోటు దక్కించుకున్నాడు.
ప్రస్తుత పరిస్థితుల ప్రకారం, భారత వన్డే క్రికెట్ జట్టులో నంబర్-4 స్థానానికి అత్యంత అనుకూలమైన బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్. అయితే గాయం కారణంగా అతను ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో, శ్రేయాస్ అయ్యర్‌కు బదులుగా, టీం ఇండియా సూర్యకుమార్ యాదవ్‌కు నాలుగో స్థానంలో ఆడే అవకాశం ఇచ్చింది. అయితే సూర్య వరుసగా మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డక్‌తో ఔటయ్యాడు. సూర్య పేలవమైన ఫామ్‌ను చూస్తుంటే, రాబోయే వన్డేలలో భారత క్రికెట్ జట్టు కూడా సంజూ శాంసన్‌ను నాల్గవ నంబర్లో ప్రయత్నించవచ్చని తెలుస్తోంది. తద్వారా అతను వన్డే ప్రపంచ కప్‌కు పరిపూర్ణంగా సిద్ధమవుతాడని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సంజూ శాంసన్ వన్డే ప్రపంచకప్‌లో నంబర్-4 బాధ్యతలు అప్పగించడానికి మరో కారణం వన్డేలలో అతని అద్భుతమైన రికార్డ్. భారత క్రికెట్ జట్టు తరపున సంజూ ఇప్పటి వరకు 11 వన్డేలు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 10 ఇన్నింగ్స్‌ల్లో సంజూ 66.00 సగటుతో 330 పరుగులు చేశాడు. ఈ సమయంలో సంజూ అత్యధిక స్కోరు 86 నాటౌట్ కాగా, అతని స్ట్రైక్ రేట్ 104.76గా నిలిచింది. అందువల్ల వన్డేల్లో 66.00 సగటుతో పరుగులు చేసిన ఆటగాడికి వన్డే ప్రపంచకప్‌లో నంబర్-4 బాధ్యతను టీమిండియా అప్పగించవచ్చని తెలుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..