భారత క్రికెటర్ కేదార్ జాదవ్ ప్రస్తుతం ఆందోళనలో కూరుకపోయాడు. కేదార్ తండ్రి అదృశ్యమయ్యాడు. పూణేలో నివాసముంటున్న కేదార్ తన తండ్రి కోసం తీవ్రంగా వెతుకుతున్నాడు. సోమవారం పూణె సిటీలోని అలంకార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశాడు. అతని తండ్రి వయస్సు 75 సంవత్సరాలు. పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. కేదార్ తండ్రి పేరు మహదేవ్ సోపన్ జాదవ్. ప్రస్తుతం ఈ క్రికెటర్ తండ్రిని వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం, క్రికెటర్ దాఖలు చేసిన ఫిర్యాదులో, మహదేవ్ సోమవారం ఉదయం పూణే నగరంలోని కోట్రుడ్ రోడ్‌లోని తన ఇంటి నుంచి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా బయలుదేరాడని, ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదని పేర్కొన్నారు. కుటుంబసభ్యులు అతడిని వెతకడానికి ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. సమాచారం అందుకున్న పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
నివేదికలో ఇచ్చిన సమాచారం ప్రకారం, మహదేవ్ ఎత్తు ఐదు అడుగుల ఆరు అంగుళాలు. అతని ముఖం ఎడమ వైపున శస్త్రచికిత్స గుర్తు ఉంది. తెల్లటి చొక్కా, గ్రే కలర్ ప్యాంటు వేసుకుని ఉన్నాడు. నలుపు చెప్పులు, కళ్ళద్దాలు ధరించాడంట. అతను మరాఠీ మాట్లాడతాడని పోలీసులు పేర్కొన్నారు. అతని వద్ద ఫోన్ లేదు. రెండు బంగారు ఉంగరాలు ధరించాడు. సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్ర షహానే ఆధ్వర్యంలో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు. అదే సమయంలో అతని గురించి ఎవరైనా సమాచారం అందిస్తే వెంటనే అలంకార్ పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..