AFG vs PAK 2nd ODI: ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో వన్డేలో ఆఫ్ఘాన్ ఓపెనర్ రహ్మతుల్లా గుర్బాజ్ అద్భుతమైన సెంచరీతో మెప్పించాడు. చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘాన్‌పై పాక్ ఓ వికెట్ తేడాతో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ ద్వారా గుర్బాజ్ వన్డేల్లో పాకిస్తాన్‌పై 151 పరుగులు చేసిన తొలి వికెట్ కీపర్ బ్యాట్స్‌మ్యాన్‌గా అవతరించాడు. 124 బంతుల్లో సెంచరీ చేసిన గుర్బాజ్.. మిగిలిన 27 బంతుల్లో మరో 51 పరుగులు చేసి 151 రన్స్‌తో వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే గుర్బాజ్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న 2 రికార్డ్‌లను బ్రేక్ చేశాడు.
పాకిస్థాన్‌పై 2005లో ధోని 123 బంతుల్లో 148 పరుగులు చేసి, ఆ దేశంపై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన వన్డే వికెట్ కీపర్‌గా ధోని అగ్రస్థానంలో ఉన్నాడు. అలాగే పాక్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆరో ఆటగాడిగా కూడా ఉన్నాడు. అయితే గురువారం మ్యాచ్‌లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో మొత్తం 151 పరుగులు చేసిన గుర్భాజ్ ఆ రికార్డ్‌ని బ్రేక్ చేశాడు. అలాగే పాకిస్థాన్‌పై అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్‌గా అగ్రస్థానంలో ఉన్న ధోని(148) రికార్డ్‌ను కూడా గుర్బాజ్(151) సొంతం చేసుకున్నాడు. మొత్తంగా మొత్తంగా పాకిస్థాన్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు.
తొలి వికెట్ కీపర్..
Rahmanullah Gurbaz is the first wicketkeeper to score a 150 in men’s ODIs against Pakistan 🇦🇫
The previous highest was by MS Dhoni in Visakhapatnam pic.twitter.com/vwRFXsnwhE
— ESPNcricinfo (@ESPNcricinfo) August 24, 2023
విశేషం ఏమిటంటే.. పాకిస్తాన్ తరఫున డేంజరస్ బౌలర్ అని చెప్పుకునే షాహీన్ ఆఫ్రిదీని కూడా గుర్బాజ్ వదల్లేదు. ముఖ్యంగా అఫ్రిదీ వేసిన 5వ ఓవర్‌లో గుర్బాజ్ ఓ సిక్సర్, 2 ఫోర్ల రూపంలో మొత్తం 16 పరుగులు సాధించాడు. ఇంకా హారిస్ రౌఫ్ ఓవర్లో కూడా 4 ఫోర్లు వేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అఫ్రిదీ బౌలింగ్‌పై గుర్బాజ్ దాడి..
Rahmanullah Gurbaz smashed three boundaries off Shaheen Afridi’s third over 🔥 #AFGvPAKpic.twitter.com/Famzm6EIKz
— CricTracker (@Cricketracker) August 24, 2023
హారిస్‌కి ఇచ్చి పడేశాడుగా..
4️⃣.4️⃣.4️⃣.4️⃣ ⚡
Gurbaz takes on Haris Rauf and how..! 👏#AfghanAtalan | #AFGvPAK | #SuperColaCup | #ByaMaidanGatohttps://t.co/3OV21zZQqi
— Afghanistan Cricket Board (@ACBofficials) August 24, 2023
2012 ఆసియా కప్ టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ 148 బంతుల్లోనే 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో మొత్తం 183 పరుగులు చేశాడు. తద్వారా పాక్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఇక కోహ్లీ తర్వాత డేవిడ్ వార్నర్(179), అలెక్స్ హేల్స్(171), బ్రియాన్ లారా(156), ఆరోన్ ఫించ్(153, నాటౌట్), రహ్మతుల్లా గుర్బాజ్(151) , ఎంఎస్ ధోని(148) టాప్ 7 లిస్టులో వరుసగా ఉన్నారు.
గుర్బాజ్ 151..
RUNS: 1️⃣5️⃣1️⃣
BALLS: 1️⃣5️⃣1️⃣
4s: 1️⃣4️⃣
6s: 3️⃣End of a brilliant batting effort by Rahmanullah Gurbaz! Absolutely Incredible 🙌⚡👏#AfghanAtalan | #AFGvPAK | #SuperColaCup | #ByaMaidanGato pic.twitter.com/UnSi3ghpuc
— Afghanistan Cricket Board (@ACBofficials) August 24, 2023
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘానిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేశారు. ఆఫ్ఘాన్ ఇచ్చిన 301 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ 49.5 ఓవర్లలో 9 వికెట్ల నష్టంతో పని పూర్తి చేసింది. దీంతో పాక్ ఓ వికెట్ తేడాతో ఆఫ్ఘాన్‌పై విజయం సాధించింది.
పాక్ విజయం..
AfghanAtalan fought all the way to the end but just couldn’t hold their nerves as Pakistan chased the target by 1 wicket. 💔#AfghanAtalan | #AFGvPAK | #SuperColaCup | #ByaMaidanGato pic.twitter.com/IkbMgTwpJB
— Afghanistan Cricket Board (@ACBofficials) August 24, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..