IPL 2023, CSK Probable Playing 11: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 16వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లో అత్యధిక అభిమానుల ఫాలోయింగ్ ఉన్న జట్లలో ఒకటిగా నిలిచింది. IPL చరిత్రలో, చెన్నై సూపర్ కింగ్స్ (CSK) 4 సార్లు ట్రోఫీని గెలుచుకుని, 5 సార్లు రన్నరప్‌గా నిలిచింది.
2022 సీజన్ CSKకి చాలా కష్టంగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఎంఎస్ ధోని, అతని సహచరులు గత సీజన్‌ను మరచిపోయి 5వ సారి ట్రోఫీని గెలుచుకోవాలని కోరుకుంటున్నారు. దీంతో 5 సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI)ని సమం చేయాలని ఆశిస్తున్నారు. అయితే, జట్టు కలయిక పరంగా, CSK IPL 2023 వేలానికి ముందు 18 మంది ఆటగాళ్లను సిద్ధం చేసుకుంది.
2019 సంవత్సరం తర్వాత, ఈసారి ఐపీఎల్ పాత ఫార్మాట్‌లో జరగనుంది. చెన్నైలో చెన్నై సూపర్ కింగ్స్ 7 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
చెన్నై సూపర్ కింగ్స్‌కు రితురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వేలో స్థిరమైన ఓపెనింగ్ జోడీ ఉంది. అయితే, కొత్తగా చేరిన బెన్ స్టోక్స్ ఓపెనర్‌గా ఉండేందుకు పోటీ పడుతున్నాడు. కాబట్టి బెన్ స్టోక్స్ జట్టులోకి వచ్చాక ఆ ఓపెనింగ్ జోడీ మారుతుందా లేదా అనేది చూడాలి. అయితే, డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్‌ల విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, CSK వీరినే ఫస్ట్-ఛాయిస్ ఓపెనర్లుగా కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
బెన్ స్టోక్స్ చెన్నై సూపర్ కింగ్స్ 5 లేదా 4 స్థానంలో మిడిల్ ఆర్డర్‌లోకి ప్రవేశించనున్నాడు. మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసేందుకు మొయిన్ అలీ తర్వాత 3వ స్థానంలో బెన్ స్టోక్స్ బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బలమైన లోయర్ ఆర్డర్‌ను కలిగి ఉంది.
రవీంద్ర జడేజా 6వ స్థానంలో, ధోనీ 7వ స్థానంలో, శివమ్ దూబేను ఫినిషర్‌గా 8వ స్థానంలో ఉంచవచ్చు. మ్యాచ్‌లోని పరిస్థితులను బట్టి రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని లేదా శివమ్ దూబే ఆర్డర్‌ను కూడా మార్చుకోవచ్చని తెలుస్తోంది.
బౌలర్ల విషయానికి వస్తే, సీఎస్‌కే స్టార్ పవర్‌ప్లే బౌలర్ దీపక్ చాహర్ తిరిగి రావడం చూడొచ్చు. దీపక్ చాహర్ గాయం కారణంగా IPL 2022లో ఆడలేకపోయాడు. కానీ, 2023లో ఆడటానికి అందుబాటులో ఉంటాడు. దీపక్ చాహర్‌కు సపోర్టుగా ముఖేష్ చౌదరి ఉన్నాడు. 2022 సీజన్ ప్రారంభంలో ముఖేష్ చౌదరి బాగా ఆకట్టుకున్నాడు.
చివరి ఓవర్సీస్ ప్లేయర్ ఆప్షన్‌లో మహేష్ తీక్షణ ఉండే అవకాశం ఉంది. CSK మహేష్ తీక్షణ స్థానంలో మిచెల్ సాంట్నర్‌ను కూడా చూడొచ్చు. అయితే ఎడమచేతి వాటం ఆటగాడు జడ్డూ ఇప్పటికే జట్టులో ఉండడంతో ఆ అవకాశం కనిపించడం లేదు.
డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, బెన్ స్టోక్స్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (c & wk), దీపక్ చాహర్, ముఖేష్ చౌదరి, మహేష్ తిఖ్‌స్నా.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..