IPL 2023: ధోని సేనకు ధమ్కీ ఇచ్చిన రూ.16.25 కోట్ల ప్లేయర్‌.. బౌలింగ్‌ చేయనంటోన్న స్టార్‌ ఆల్‌రౌండర్‌!

|

Mar 28, 2023 | 6:26 PM

ఈ నెల 31న అహ్మాదాబాద్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ సీజన్‌ షురూ కానుంది. కాగా మొదటి మ్యాచ్‌కు ముందే ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

IPL 2023: ధోని సేనకు ధమ్కీ ఇచ్చిన రూ.16.25 కోట్ల ప్లేయర్‌.. బౌలింగ్‌ చేయనంటోన్న స్టార్‌ ఆల్‌రౌండర్‌!
Chennai Super Kings
Follow us on

క్రికెట్‌ అభిమానులకు అన్‌స్టాపబుల్‌ వినోదాన్ని అందించే ఐపీఎల్‌ ప్రారంభానికి మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని జట్ల ఆటగాళ్లు ఈ ధనాధన్‌ లీగ్‌ కోసం రెడీ అయిపోయారు. ఈ నెల 31న అహ్మాదాబాద్‌ వేదికగా చెన్నై సూపర్‌ కింగ్స్‌, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్‌ సీజన్‌ షురూ కానుంది. కాగా మొదటి మ్యాచ్‌కు ముందే ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిచి.. ఐదోసారి టైటిల్‌ కొట్టేందుకు సిద్ధమవుతోన్న తరుణంలో ఆ జట్టుకు ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ భారీ షాక్‌ ఇచ్చాడు. అదేంటంటే.. ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌ల్లో స్టో్క్స్‌ కేవలం స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే బరిలోకి దిగుతాడంట. బౌలింగ్ చేయట. ఈ విషయాన్ని ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ వెల్లడించాడు. బెన్‌ స్టోక్స్‌ మోకాలి నొప్పితో తీవ్రంగా బాధపడుతున్నాడని, టోర్నీ మధ్యలోనే అతను బౌలింగ్‌ చేయాలని కోరుకుంటున్నట్లు హస్సీ తెలిపాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గాయపడ్డ స్టో్క్స్‌.. ఆ సిరీస్‌లో కేవలం 9 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. బౌలింగ్‌ చేసే సమయంలో తీవ్రమైన నొప్పి ఉంటుందని అందుకే ఐపీఎల్‌లో కూడా కేవలం బ్యాటర్‌గానే చెన్నైసూపర్ కింగ్స్ కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.

కాగా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదరగొట్టే స్టోక్స్‌ ఆల్‌రౌండర్‌గా ఉపయోగపడతాడని ఐపీఎల్‌ 2023 మినీ వేలంలో కొనుగోలు చేసింది చెన్నై. ఇందుకోసం ఏకంగా రూ.16.25 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు స్టోక్స్‌ కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితం అయితే.. బౌలింగ్‌ విభాగం బాగా వీక్‌ అయ్యే అవకాశం ఉంది. ఇది సీఎస్‌కే విజయావకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కాగా ఈ ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ గత సీజన్లలోనూ ఎప్పుడూ పూర్తిగా ఆడలేదు. 2017 సీజన్‌లో అరంగేట్రం చేసిన స్టోక్స్‌.. ఆ ఎడిషన్‌లో కేవలం 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ తర్వాత 2018లో 13 మ్యాచ్‌లు, 2019, 2020 సీజన్లలో 10 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 2021, 2022 సీజన్లలోనూ అదే పరిస్థితి. ఇప్పుడు కూడా గాయం కారణంగా సీజన్‌కు దూరం కాకూడదనే కేవలం బ్యాటర్‌గానే ఆడనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..