Viral News: అదనపు కట్నంగా ట్రాక్టర్‌ను అడిగిన వరుడు.. వధువు ఫ్యామిలీ చేసిన పనికి పెళ్లి కొడుకు ఫీజులవుట్.
సమాజం ఎంత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా ఇప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం వెనుకబడే ఉంటుంది. అలాంటి వాటిలో వరకట్నం ఒకటి. ఓవైపు వరకట్నం తీసుకోకూడదని భారీ ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉన్నా. మరోవైపు వరకట్న వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత...
సమాజం ఎంత అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నా ఇప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం వెనుకబడే ఉంటుంది. అలాంటి వాటిలో వరకట్నం ఒకటి. ఓవైపు వరకట్నం తీసుకోకూడదని భారీ ఎత్తున ప్రచారం జరుగుతూనే ఉన్నా. మరోవైపు వరకట్న వేధింపులు పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లి తర్వాత అదనపు కట్నం కోసం వేధించే వారిని చూసి ఉంటాం. అయితే తాజాగా ఓ వరుడు మాత్రం పెళ్లికి ముందే అధికంగా వరకట్నం కావాలని అడిగాడు. అధిక కట్నం కింద కొత్త ట్రాక్టర్ ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అయితే వధువు తరఫు కుటుంబ సభ్యులు సదరు వరుడికి బుద్ధి చెప్పాలని ఓ ప్లాన్ వేశారు. దీంతో ఈ సంఘటన కాస్త వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.
ఉత్తర ప్రదేశ్‌కి చెందిన ఓ వరుడు వివాహానికి ముందు తనకు అదనపు కట్నంగా ట్రాక్టర్ కావాలని డిమాండ్ చేశాడు. దీంతో వరుడి కండిషన్‌కు ఒప్పుకున్నట్లే ఒప్పుకున్న వధువు కుటుంబ సభ్యులు.. వరుడు కోరినట్లు కొత్త ట్రాక్టర్‌ను డెకరేట్ చేసి మండపానికి తీసుకొచ్చారు. అయితే మండపానికి చేరుకున్నాక వరుడు కుటుంబాన్ని బంధించి.. మీరు పెళ్లి చేసుకోవాల్సింది వధువును కాదు ట్రాక్టర్‌ను చేసుకోవాలని ట్విస్ట్ ఇచ్చారు. దీంతో పెళ్లి కొడుకు ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
విషయం అర్థమైన వరుడి ఫ్యామిలీ.. పెళ్లిని రద్దు చేసుకున్నారు. అంతే కాకుండా పెళ్లి కోసం చేసిన ఖర్చులు కూడా చెల్లిస్తామని అంగీకరించారు. దీంతో పెళ్లి కూతురు కుటుంబం వారిని విడిచిపెట్టింది. ఇక ఈ సంఘటనపై పెళ్లి కూతురు మేనమామ మాట్లాడుతూ..పెళ్లికి ముందే ఒప్పుకున్నట్లు లక్షలు ఖర్చు చేసి అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేశాము. కానీ వీటికి సంతృప్తి చెందని పెళ్లి కొడుకు కుటుంబం అదనపు కట్నంగా ట్రాక్టర్ కావాలని డిమాండ్ చేశాడు. దీంతో తన మేన కోడలు పెళ్లికి ఆసక్తి చూపించలేదని అందుకే పెళ్లి కొడుక్కి అలా బుద్ధి చెప్పామని చెప్పుకొచ్చాడు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..