Kavitha Advocate: మరోసారి ఈడీ ఆఫీసుకు కవిత అడ్వొకేట్ సోమ భరత్.. ఫోన్ డేటాను సేకరిస్తున్న అధికారులు
దేశ వ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న చాలా మందిని ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). ఇక బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా మూడు సార్లు విచారించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కవిత ఫోన్‌లను పరిశీలిస్తోంది ఈడీ..
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). అయితే.. విచారణలో భాగంగా కవిత వద్ద ఉన్న ఫోన్‌లను ఈడీ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఫోన్‌లను ఓపెన్ చేసి అందులో ఉన్న డేటాను పరిశీలిస్తున్నందున స్వయంగా గానీ, ఆమె ప్రతినిధి హాజరు కావాలని ఈడీ సూచించడంతో కవితకు బదులు ఆమె న్యాయవాది సోమా భరత్ ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఫోన్ల లాక్ కు సంబంధించి ఆమెను రమ్మని పిలిచారు. ఫోన్ల పరిశీలనకు ఆథరైజ్డ్ పర్సన్ ను పంపించమని తెలిపింది ఈడీ.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపున మంగళవారం ఈడీ కార్యాలయానికి వెళ్లిన సోమ భరత్.. బుధవారం మరోసారి ఈడీ ఆఫీస్‌కి వెళ్లారు. కవిత మొబైల్‌లలో డేటా, ఇతర అంశాలపై భరత్‌ను ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే మరోసారి విచారణకు పిలవలేదని కేవలం తమకు ఉన్న అనుమానాలను క్లియర్ చేసుకునేందుకు పిలిచినట్లు సోమ భరత్ తెలిపారు. ఇదిలా ఉండగా, లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎందుర్కొంటున్న కవిత.. ఇప్పటి వరకు ఈడీ అధికారుల ముందు మూడు సార్లు హాజరయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి