తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. తండ్రి మందలించాడని తొమ్మిదేళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. రీల్స్ పిచ్చి ఆ బాలికనూ సూసైడ్ వరకు తీసుకెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడు తిరువళ్లువార్‌కు చెందిన ప్రతిషా (9) సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుందని తండ్రి మందలించాడు. చదువు పక్కనబట్టి రీల్స్ చేసుకుంటుండంటో తండ్రి మందలించాడు. రీల్స్ మానేసి చదువుకోవాలని గట్టిగా చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ బాలిక తండ్రి బయటకు వెళ్లగానే ప్రతీషా ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. చిన్నారి మృతితో ఆ కుటుంబం తీరని శోకంలో మునిగిపోయింది. ఈ విషాద సంఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.