My India My LiFE Goals: పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు కేంద్రం చేపట్టిన ‘మై ఇండియా- మై లైఫ్ గోల్స్’ కార్యక్రమంలో టీవీ9 కూడా భాగస్వామిగా ఉంది. ఈ ఉద్యమంలో భాగస్వామిగా నిలిచినందుకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ టీవీ9ను అభినందించారు. పర్యావరణ విషయంలో సరైన స్పృహతో మనం ముందుకు సాగినట్లయితే ప్రతీ ఒక్కరూ ప్రేరణ పొందుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పర్యావరణానికి అనుకూల రీతిలో ప్రతీ ఒక్కరి జీవనశైలి ఉండాలని దేశప్రజలను కోరారు. ఈ సందర్భంగా చిన్న చిన్న చర్యలతోనే పర్యావరణానికి మేలు చేయవచ్చన్న టీవీ9 ఆలోచనను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మెచ్చుకున్నారు.
కాగా, ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రధాని మోదీ ఈ ప్రత్యేక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ ప్రధాని మోదీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం కోసం పాటు పడాలి, పర్యావరణ పరిరక్షణ కోసం ముందడుగు వేయాలి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత’ అంటూ యావత్ దేశానికి పిలుపునిచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..