New Year Gifts: న్యూ ఇయర్ కు మీ మనస్సుకు నచ్చిన వారికి గిఫ్ట్స్ ఇవ్వాలా? ఈ లిస్ట్ ను ఒకసారి చెక్ చేయండి
కొత్త సంవత్సరం సరికొత్తగా ఉండాలంటూ మన మనస్సుకు నచ్చిన వారికి బహుమతులు ఇస్తాం. బహుమతి అంటే వారు అందరికీ చెప్పకునే విధంగా ఉండాలి. దీంతో మన అందులో ప్రత్యేకత కోసం ప్రయత్నిస్తుంటాం. అందుకు తగినట్టే మీ అభిరుచికి అనుగుణంగా కొన్నింటిని షార్ట్ లిస్ట్ చేశాం.
దేశంలో క్రిస్మస్ సందడి తగ్గి న్యూ ఇయర్ సందడి మొదలవుతోంది. కొత్త సంవత్సరం సరికొత్తగా ఉండాలంటూ మన మనస్సుకు నచ్చిన వారికి బహుమతులు ఇస్తాం. బహుమతి అంటే వారు అందరికీ చెప్పకునే విధంగా ఉండాలి. దీంతో మన అందులో ప్రత్యేకత కోసం ప్రయత్నిస్తుంటాం. అందుకు తగినట్టే మీ అభిరుచికి అనుగుణంగా కొన్నింటిని షార్ట్ లిస్ట్ చేశాం. అవి ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. వెంటనే ఆర్డర్ చేస్తే న్యూ ఇయర్ సమయానికి డెలివర్ అవుతాయి. కాబట్టి అలాంటి గ్యాడ్జెట్స్ పై ఓ లుక్కెద్దాం.
ఆపిల్ ఐ ఫోన్ 14
మీకు బహుమతి ఇవ్వడానికి బడ్జెట్ అనేది ప్రాబ్లమ్ కాకపోతే మీకు నచ్చిన వారికి ఐ ఫోన్ 14 ను బహుమతిగా ప్రజెంట్ చేయండి. ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ లో రూ.77,490 కు అమెజాన్ లో అందుబాటులో ఉంది. 2232X1170 రెజుల్యూషన్ తో, 6.1 అంగుళాల సూపర్ రెజినా ఎక్స్ డీఆర్ తో ఈ మొబైల్ వినియోగదారుల మనస్సును గెలుచుకుంటంది. ఈ మొబైల్ ను గిఫ్ట్ గా ఇస్తే అదిపోతుంది.
ఆపిల్ వాచ్ సిరీస్ ఎస్ ఈ
గ్యాడ్జెట్స్ లో ఆపిల్ గ్యాడ్జెట్స్ రేంజ్ వేరు. సో ఆపిల్ వాచ్ సిరీస్ ఎస్ ఈ రూ.30,900 కు అమెజాన్ లో అందుబాటులో ఉంది. కాల్ చేయడానికి, టెక్ట్స్ చేయడానికి ఈ స్మార్ట్ వాచ్ ఉపయోగపడుతుంది. ఇది ఎమర్జెన్సీ ఎస్ఓఎస్, ఫాల్ డిటెక్షన్, ఇర్రెగ్యులర్ హార్ట్ రిథమ్ నోటిఫైయర్ వంటి వివిధ లక్షణాలతో వస్తుంది.
వన్ ప్లస్ బడ్స్ జెడ్ 2
మీరు గిఫ్ట్ ఇవ్వాల్సిన వారు మ్యూజిక్ లవర్స్ అయితే ఈ వన్ ప్లస్ బడ్స్ జెడ్ 2ను గిఫ్ట్ గా ఇస్తే వారు చాలా ఆనందపడతారు. ఇవి రూ.4,999 కు అమెజాన్ లో అందుబాటులో ఉన్నాయి. 40 డీబీ వరకూ నాయిస్ క్యాన్సలేషన్, 11 ఎంఎం డైనమిక్ డ్రైవర్లతో వస్తుంది. అలాగే ఇవి వాటర్ రెసిస్టెంట్ బడ్స్ కావడం వల్ల వీటిని ప్రజెంట్ చేయడం ఉత్తమం.
సామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 లైట్
అమెజాన్ లో ఈ ట్యాబ్లెట్ రూ.37,999 కు అందుబాటులో ఉంది. 12.4 అంగుళాల డిస్ ప్లే తో, స్నాప్ డ్రాగన్ 700 ప్రాసెసర్ తో ఈ ట్యాబ్ వస్తుంది. ఆండ్రాయిడ్ 11తో పని చేసే ఈ ట్యాబ్ కు 45 W సూపర్ చార్జ్ ఫెసిలిటీ, అలాగే 10900 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వస్తుంది.
నథింగ్ ఫోన్ (1)
కస్టమర్లు ఫ్లిప్ కార్ట్ లో నథింగ్ ఫోన్ (1) ను రూ.27,999 కు కొనుగోలు చేయవచ్చు. స్నాప్ డ్రాగన్ 778 ప్రాసెసర్ తో వచ్చే ఈ ఫోన్ 6.55 అంగుళాల డిస్ ప్లే తో వస్తుంది. 50 ఎంపీ బ్యాక్ కెమెరాతో పిక్చర్ ప్రేమికులను కచ్చితంగా ఆకట్టుకుంది. సో ఈ మొబైల్ న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వడానికి మంచి ఎంపిక.
గూగుల్ పిక్సెల్ స్మార్ట్ వాచ్
ప్రస్తుతం అంతా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. అలాంటి వారికి ఉపయోగపడేలా గూగుల్ పిక్సెల్ స్మార్ట్ వాచ్ ను బహూకరించవచ్చు. ఈ వాచ్ వేర్ ఓఎస్ తో పని చేస్తుంది. స్క్రాచ్ రెసిస్టెంట్ తో పాటుగా గొర్రిల్లా గ్లాస్ ఫీచర్ తో వస్తుంది. ఈ వాచ్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లలో అందుబాటులో ఉంది.
బోట్ స్టోన్ 1450 వైర్ లెస్ బ్లూటూత్ స్పీకర్లు
మ్యూజిల్ లవర్స్ కు ఈ వైర్ లెస్ స్పీకర్లు ఓ మంచి ఎంపిక. వీటిని క్యారీ చేయడం చాలా సులభం. అలాగే ఎక్కడ నుంచైనా వీటిని ఆపరేట్ చేయవచ్చు. అమెజాన్ ఇవి రూ. 3,999కు అందుబాటులో ఉన్నాయి. 40- వాట్ ఆర్ ఎంఎస్ సౌండ్ ఫీచర్ దీని ప్రత్యేకత. అలాగే టీడబ్ల్యూఎస్ ఆపరేటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది.
గోద్రేజ్ సొలస్ వీడియో డోర్ ఫోన్
మనకు కావాల్సిన వారి భద్రత కోసం మనం నిత్యం ఆలోచిస్తుంటాం. వారికి ఈ సొలస్ వీడియో డోర్ ఫోన్ బహుమతిగా ఇస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ధర 6,899. 7 ఇంచ్ ల టీఎఫ్ టీ డిస్ ప్లే దీని ప్రత్యేకత. రాత్రి సమయంలో చూడడానికి ఎల్ ఈ డీ లైటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది.
అమెజాన్ బేసిక్స్ వైర్ లెస్ మ్యాగ్నెటిక్ చార్జర్
ఈ చార్జర్ ధర రూ.1249. ఇది ఐ ఫోన్ 13 సిరీస్, ఐ ఫోన్ ప్రో మ్యాక్స్ 13,12,11. శాంసంగ్ గ్యాలక్సీ ఎస్ 21, ఎస్ 20, నోట్ 10, ఎడ్జ్ నోట్ 20 అల్ట్రా, ఎస్ 10 తో సజావుగా పని చేస్తుంది. సో ఈ మొబైల్స్ వాడే వారికి ఈ చార్జర్ ను బహుమతిగా ఇస్తే చాలా ఉపయోగ పడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.