Health Tips: కాఫీ, టీతో పాటు బజ్జీ, పకోడీలు తింటున్నారా..? అయితే, మీరు ప్రమాదంలో పడినట్టే..!
పకోడీ, బజ్జీ విత్ టీ, కాఫీ అందరినీ ప్రియమైన కాంబినేషన్‌గా చెబుతారు. బజ్జీ, పకోడీ తినడానికి ఇష్టపడని వారు ఉండరు . మీరు కూడా వాటిని కలిసి తింటుంటే, ఇప్పుడు జాగ్రత్త వహించండి.
టీ, కాఫీతో పాటు చిరుతిండిని తీసుకుంటే. ముఖ్యంగా వర్షకాలం, చలికాలంలో చల్లటి వాతావరణంలో పకోడీలు, బజ్జీలతో పాటు టీ, కాఫీలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. పకోడీ, బజ్జీ విత్ టీ, కాఫీ అందరినీ ప్రియమైన కాంబినేషన్‌గా చెబుతారు. బజ్జీ, పకోడీ తినడానికి ఇష్టపడని వారు ఉండరు . మీరు కూడా వాటిని కలిసి తింటుంటే, ఇప్పుడు జాగ్రత్త వహించండి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ఆరోగ్యానికి అతి ప్రమాదకరం అంటున్నారు. టీతో పాటు పకోడీలు, బజ్జీలు తినడం హానీకరం అంటున్నారు. ఇది కడుపు సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇలా తినడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. అజీర్తి సమస్య కూడా రావచ్చునని చెబుతున్నారు.
టీతో వీటిని ఎప్పుడూ తినకూడదు : పచ్చి కూరగాయలు,ఏదైనా పండ్లను టీతో పాటు తినకూడదు. పచ్చి కూరగాయలను టీతో కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే, మొలకెత్తిన పప్పులు, సలాడ్ వేడి టీతో తినకూడదు. ఇది కూడా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
టీ తాగిన వెంటనే ఇవి.. టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదని పెద్దలు చెబుతుంటారు. ఇది నిజం. శాస్త్రీయంగా టీ తాగిన తర్వాత నీళ్లు తాగకూడదు. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇలా చేయడం వల్ల దంతాలు పాడైపోయే ప్రమాదం ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.