Gizmore Smart Watch : సూపర్ స్టైలిష్ డిజైన్‌తో వోగ్ స్మార్ట్ వాచ్ తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్ యాక్సెసరీ ఫిట్‌నెస్ గేర్, హోమ్ ఆడియో బ్రాండ్ అయిన గిజ్మోర్ కూడా ఓ కొత్త స్మార్ట్ వాచ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వోగ్ పేరుతో తన ఆకర్షనీయమైన స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ ధర రూ. 1,999గా కంపెనీ నిర్ణయించింది.
ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్ వాచ్‌లను ధరిస్తున్నారు. గతంలో ఎనలాగ్ క్లాక్ ధరించే అలవాటు ఉన్నవారు క్రమేపి స్మార్ట్ వాచ్‌లను ఉపయోగించడానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం స్మార్ట్ వాచ్ ఇండియాలో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నాయి. ఈ జోరును దృష్టిలో పెట్టుకున్న కంపెనీలు కూడా వివిధ ఆప్షన్లలో స్మార్ట్ వాచ్‌లను రూపొందిస్తున్నాయి. హెల్త్, ఫిట్‌నెస్ వివరాలు తెలిసేలా స్మార్ట్ వాచ్‌లను తయారు చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ యాక్సెసరీ ఫిట్‌నెస్ గేర్, హోమ్ ఆడియో బ్రాండ్ అయిన గిజ్మోర్ కూడా ఓ కొత్త స్మార్ట్ వాచ్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వోగ్ పేరుతో తన ఆకర్షనీయమైన స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసింది. ఈ కొత్త స్మార్ట్ వాచ్ ధర రూ. 1,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వాచ్ అందుబాటులో ఉంది. సొగసైన బాడీతో వచ్చే ఈ స్మార్ట్ వాచ్ 320×385 పిక్సెల్‌లతో 1.95-అంగుళాల HD డిస్‌ప్లేతో వస్తుంది.మెటల్ కేసింగ్, స్క్వేర్ డయల్‌తో ఆకర్షనీయంగా దీన్ని రూపొందించారు. ఈ స్మార్ట్ వాచ్ 91 శాతం బాడీ-టు-స్క్రీన్ రేషియోతో వస్తుంది. మెరుగైన ఫారమ్ ఫ్యాక్టర్‌తో పెద్ద ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకత.
అధునాత ఫీచర్లతో వచ్చే ఈ స్మార్ట్ వాచ్‌లో షార్ట్‌కట్ మెను కోసం స్ప్లిట్-స్క్రీన్ వీక్షణను అందిస్తుంది. ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లేతో మరింత ఆకర్షనీయంగా ఉంటుంది. 600 నిట్‌ల ప్రకాశంతో వచ్చే ఈ వాచ్ స్క్రీన్ కఠినమైన సూర్యకాంతిలో కూడా ఉపయోగించడం సులభంగా ఉంటుంది. గిజ్మోర్ వోగ్ స్మార్ట్ వాచ్ 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లతో వస్తుంది. వినియోగదారులు తమ వాచీని వారి ఎంపిక ప్రకారం పూర్తిగా అనుకూలీకరించడానికి వీలు కల్పిస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ తిరిగే డయల్‌తో అమర్చి ఉంటుంది. దీంతో సులభంగా మెనూని నావిగేట్ చేసే ఫీచర్‌తో వస్తుంది. సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది పవర్ ఆన్ మరియు ఆఫ్ కోసం 2 ప్రత్యేక బటన్‌లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ జీపీఎస్ ట్రాజెక్టరీ ఫీచర్‌ను అందిస్తుంది. ఇది కస్టమర్లు వారి కార్యాచరణ మొత్తాన్ని ట్రాక్ చేయడానికి, అలాగే వీ ఫిట్ యాప్ ద్వారా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో భాగస్వామ్యం చేయడానికి అనుమతిస్తుంది. అంతర్నిర్మిత సెన్సార్‌లు వినియోగదారులను డేటాను కచ్చితంగా క్యాప్చర్ చేయడానికి అనుమతిస్తాయి. ఈ స్మార్ట్‌వాచ్‌లో అవసరమైన అన్ని ట్రాకర్‌లు కూడా ఉన్నాయి. వినియోగదారులు వారి హృదయ స్పందన రేటు, ఎస్పీ ఓ 2 స్థాయిలు, మహిళల కోసం రుతు చక్రం, అలాగే నిద్ర చక్రం పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది. ధ్యానం, నిశ్చల, నిర్జలీకరణ రిమైండర్‌లను కూడా అందిస్తుందించడం ఈ స్మార్ట్ వాచ్ ప్రత్యేకత.
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం