Spinal Cord Pain: వెన్ను నొప్పి బాధిస్తుందా.. ఈ సంకేతాలు మీలో కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. వైద్యులను సంప్రదించండి..

జీవనశైలిలో మార్పుల కారణంగా ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా రోగాల బారిన పడుతున్నారు. గతంలో పలానా వయసులో పలానా వ్యాధులు వస్తాయని అనుకునేవారు. కాని కాలం మారుతున్న కొద్దీ వచ్చే వ్యాధులకు వయసుతో సంబంధం ఉండటం లేదు. ముఖ్యంగా వెన్నెముక సమస్య..

Spinal Cord Pain: వెన్ను నొప్పి బాధిస్తుందా.. ఈ సంకేతాలు మీలో కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి.. వైద్యులను సంప్రదించండి..
Spinal Cord Pain
Follow us
Amarnadh Daneti

|

Updated on: Jan 12, 2023 | 5:14 AM

జీవనశైలిలో మార్పుల కారణంగా ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా రోగాల బారిన పడుతున్నారు. గతంలో పలానా వయసులో పలానా వ్యాధులు వస్తాయని అనుకునేవారు. కాని కాలం మారుతున్న కొద్దీ వచ్చే వ్యాధులకు వయసుతో సంబంధం ఉండటం లేదు. ముఖ్యంగా వెన్నెముక సమస్య వయసు పెరిగిన వారిలో వచ్చేవి. ఇటీవల కాలంలో యువకులు కూడా వెన్నుముక నొప్పి సమస్య బారిన పడుతున్నారు. సరిగ్గా నిలబడాలంటే వెన్నెముక దృఢంగాఉండాలి. సాధారణంగా వయస్సు పెరిగేకొద్దీ వెన్నెముక వంగిపోవడం, బలహీనపడటం జరుగుతుంది. వయసు పెరిగేకొద్దీ వచ్చే నొప్పులు ప్రస్తుతం ఏ వయసు వారికైనా వస్తున్నాయి. వెన్నునొప్పితో కొంత మంది దీర్థకాలంగా బాధపడుతూ ఉంటారు. ఈ విధమైన నొప్పికి అనేక కారణాలు ఉన్నాయి. వెన్నునొప్పి కలగటానికి ముఖ్యంగా చాలాకాలంగా కొనసాగిస్తున్న నష్టదాయకమైన అలవాట్లు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు వైద్య నిపుణులు. కంప్యూటర్ పైన నిరంతరం వంగి పనిచేసే వారు ఇటీవల కాలంలో ఎక్కువగా మెడనొప్పి తో బాధపడుతున్నారు. దీనినే టెక్ నెక్ అని కూడా పిలుస్తున్నారు. ఇలా వంగి పనిచేసే అలవాటు వెన్నునొప్పికి దారితీస్తుంది. మిగతా కారణాలలో ప్రమాదాలు, కండరాలు అలసి దెబ్బదినటం, క్రీడలలో పాల్గొన్నప్పుడు తగిలిన గాయాల వల్ల వెన్ను నొప్పి బారిన పడతారు.

వెన్నునొప్పి లక్షణాలు

సాధారణంగా వెన్ను నొప్పి రోజంతా ఉంటుంది. కానీ కొందరిలో కేవలం రాత్రిళ్లు మాత్రమే వెన్ను నొప్పి వస్తుంది. పగలంతా మామూలుగానే ఉన్నా రాత్రిళ్లు తీవ్రమైన వెన్ను నొప్పితో పడుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. మెడ కింది భాగం నుంచి వెన్నుచివరన ఉండే టెయిల్ బోన్ దాకా వెన్ను వెంట బిగసుకుపోయినట్లు అనిపించడం. ఎంతకూ ఉపశమనం లేకుండా నొప్పిఉండటం, మెడలో, వీపు పైభాగంలో, వీపు కింది భాగంలో చాలా నొప్పిగా ఉండటం,. ఏదైనా బరువు ఎత్తినపుడు, శ్రమతో కూడిన పనులేమైనా చేసినపుడు నొప్పి మరింత ఎక్కువ అనిపించటం. ఎక్కువ సేపు కూర్చున్నా, నిలబడ్డా వీపు మధ్య, కింది భాగాలలో నొప్పి, వీపు కింది భాగం నుంచి పిరుదులు, తొడలు, పిక్కలు, వేళ్ల వరకూ నొప్పి ఉండటం వెన్నుముక నొప్పి లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు.

వెన్ను నొప్పికి కారణాలు

ఆధునిక కాలంలో అందరికీ వెన్నునొప్పి ఎదురవుతూనే ఉంటుంది. ఈ నొప్పి కొందరికి తక్కువగా ఉంటే, కొందరికి ఎక్కువుగా ఉంటుంది. వీపు దిగువ భాగంలో కండరాలు విపరీతంగా అలసిపోవటంతో వెన్ను నొప్పి మొదలవుతుంది. వీపు కింది భాగంలో ఉండే అనేక కండరాలు, లిగమెంట్స్ వెన్నుపూనలకు అతుక్కుని ఉండి మొత్తం వెన్నుని వీపు మధ్యలో నిలబెట్టి ఉంచుతుంటాయి. మనం కూర్చుని, నిలబడి పనులు చేసే సమయంలో తెలియకుండానే ఆ కండరాలు విపరీతంగా సాగేట్లు చేస్తాం. ఫలితంగా వాటిపై ఒత్తిడి పెరిగి, వెన్నునొప్పికి దారితీస్తుంది. కొంత మందిలో సాధారణమైన అలవాట్ల కారణంగా చిన్న వయస్సు నుంచే ఈ కండరాల పైన నిరంతరం ఒత్తిడి కొనసాగుతుంది. శ్రమతో కూడిన పని చేయటం ద్వారా కలిగే నొప్పి తాత్కాలికమే అయినా, ఈ అలవాటు నిరంతరం కొనసాగితే కండరాలు బాగా అలసిపోతాయి, బలహీనపడతాయి. దీంతో అవి వెన్నును సరైన ప్రదేశంలో నిలిపి ఉంచలేకపోతాయి. ఈ రకంగా వెన్ను నొప్పి మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి

రోజువారీ కార్యక్రమాలకు తీవ్రమైన ఆటంకం కలిగించే వేదన తోపాటు వెన్నునొప్పి వెనుక ఇతర ఆరోగ్య ప్రమాదాలు ఉండి హఠాత్తుగా బయటపడే ప్రమాదం ఉంటుంది. చేతులు,కాళ్లు, గజ్జలల తిమ్మిర్లు పొడిచినట్లు అనిపిస్తే వెన్నుపాముకు కొంత నష్టం జరిగిందని గుర్తించాలి. ఈ పరిస్థితిలో వెంటనే వైద్యసాయం పొందాలి. నడుము దగ్గరనుంచి ముందుకు వంగినపుడ, దగ్గినపుడు నొప్పి ఎక్కువ అయితున్నట్లయితే అది హెర్నియేటెడే డిస్క్. జ్వరం, మూత్ర విసర్జన సమయంలో మంట ఉండి తరచూ మూత్రానికి వెళ్ల వలసి వస్తుంటే వెన్ను నొప్పితోపాటు ఇన్ఫెక్షన్ సోకినట్లు గమనించాలి. వెన్ను నొప్పి కాలు వెనుకభాగం మీదుగా కిందికి వస్తే అది సయాటికా. ఇలా వెన్నునొప్పితో పాటు పై లక్షణాలు కనిపిస్తే తక్షణమే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..