Upasana Konidela: మెగా కోడలి సేవలకు గుర్తింపు.. అరుదైన ఘనత దక్కించుకున్న ఉపాసన.. ప్రశంసల వెల్లువ

|

Mar 25, 2023 | 7:03 AM

ఒక వైపు సినిమాలతో బిజిబిజీగా ఉంటోన్న భర్తకు అండగా ఉంటూన్న ఉప్సీ.. మరోవైపు తనదైన సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Upasana Konidela: మెగా కోడలి సేవలకు గుర్తింపు.. అరుదైన ఘనత దక్కించుకున్న ఉపాసన.. ప్రశంసల వెల్లువ
Ram Charan, Upasana
Follow us on

ఆస్కార్‌ విజయంతో ఆనందంలో ఉన్న మెగా ఫ్యామిలీకి మరో అరుదైన ఘనత దక్కింది. మెగా కోడలు, రామ్‌చరణ్‌ సతీమణి కొణిదెల ఉపాసన అరుదైన గౌరవం దక్కించుకుంది. ఒక వైపు సినిమాలతో బిజిబిజీగా ఉంటోన్న భర్తకు అండగా ఉంటూన్న ఉప్సీ.. మరోవైపు తనదైన సేవా కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాగే అపోలో హాస్పిటల్‌ చైర్మన్‌ సి. ప్రతాప్‌ రెడ్డి మనవరాలిగా, ఆయన వార సత్వాన్ని నిలబెడుతూ వైద్య రంగంలో తన దైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అపోలో ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ పలు సామాజిక కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే ‘బి పాజిటివ్’ అనే హెల్త్ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్విస్తోంది. ఇలా సేవా రంగంలో తనదైన శైలిలో దూసుకెళుతోన్న ఉపాసనకు ప్రతిష్ఠాత్మక గుర్తిపు లభించింది. ఎకనామిక్‌ టైమ్స్ ప్రకటించిన ‘మోస్ట్‌ ప్రామిసింగ్‌ బిజినెస్‌ లీడర్స్ ఆసియా 2022-23’లో జాబితాలో ఉపాసన చోటు దక్కించుకుంది.

ఉపాసన చేసిన సేవలకు గానూ ఈ పురస్కారం లభించిందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. దీనికి కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేసింది ఉప్సీ. దీంతో మెగా అభిమానులు, సెలబ్రిటీలు, నెటిజన్లు మెగా కోడలిపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. రామ్‌చరణ్‌-ఉపాసన దంపతులు త్వరలోనే అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందనున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత సెన్సేషనల్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు చెర్రీ. ఆర్‌సీ 15 (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్‌ పూర్తయింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..