Tollywood: పాలబుగ్గల చిన్నారి.. ఇప్పుడు వెండితెర జాబిలమ్మ.. ముద్దులొలుకుతున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి..

పైన ఫోటోను చూశారు కదా.. ఈ పాల బుగ్గల బుజ్జాయి ఇప్పుడు వెండితెర జాబిలమ్మ అండి. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

Tollywood: పాలబుగ్గల చిన్నారి.. ఇప్పుడు వెండితెర జాబిలమ్మ.. ముద్దులొలుకుతున్న ఈ బుజ్జాయి ఎవరో గుర్తుపట్టండి..
Tollywood
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 27, 2023 | 1:03 PM

ప్రస్తుతం తెలుగు చిత్రపరిశ్రమలో వరుస అవకాశాలతో టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న నటీమణుల గురించి పరిచయం అవసరం లేదు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకుని.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకుని భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అందులో ఈ చిన్నారి కూడా ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మన టాలీవుడ్ హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అందులో భాగంగానే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో కూడా ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఈ పాల బుగ్గల బుజ్జాయి ఇప్పుడు వెండితెర జాబిలమ్మ అండి. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ అమ్మడును ఫ్యాన్స్ అంతా బుట్టబొమ్మ అని పిలుచుకుంటారు. గుర్తుపట్టారా ?.. తనే టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.

1990 అక్టోబర్ 13న ముంబైలో జన్మించింది పూజా. 2010లో విశ్వసుందరి పోటీలకు భారత్ నుంచి ఎంపికై రెండో స్థానంలో నిలిచంది. నటనపై ఆసక్తితో 2012లో తమిళ్ సూపర్ హీరో సినిమా ముగమూడి సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత 2014లో వరుణ్ తేజ్ నటించిచన ముంకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది. ఈ సినిమా తర్వాత అక్కినేని నాగచైతన్య జోడిగా ఒక లైలా కోసం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో పూజాకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఇవి కూడా చదవండి

దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, సాక్ష్యం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అల వైకుంఠపురం చిత్రాల్లో నటించింది. గతేడాది ప్రభాస్ సరసన రాధేశ్యామ్ సినిమాలో నటించింది. అయితే గత కొద్ది రోజులుగా పూజా నటించిన చిత్రాలన్ని డిజాస్టర్స్ గా మిగిలాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు ఆఫర్స్ కూడా తగ్గాయి. విజయ్ సరసన బీస్ట్ సినిమాలో నటించినప్పటికీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం పూజా త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖన్ నటిస్తోన్న కిసీ కా భాయ్ కిసీ కి జాన్ చిత్రంలో కనిపించనుంది.

View this post on Instagram

A post shared by Pooja Hegde (@hegdepooja)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.