Covid-19: భారత్‌లో దడపుట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్.. ఏప్రిల్‌లో మాక్‌డ్రిల్..

|

Mar 27, 2023 | 7:37 AM

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1590 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభిస్తుండటంతో కేంద్రం సర్కార్‌ అలెర్టయింది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు పరీక్షలు, ట్రాకింగ్‌, చికిత్స, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచించింది.

Covid-19: భారత్‌లో దడపుట్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. అన్ని రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్.. ఏప్రిల్‌లో మాక్‌డ్రిల్..
Covid19
Follow us on

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1590 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా విజృంభిస్తుండటంతో కేంద్రం సర్కార్‌ అలెర్టయింది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు పరీక్షలు, ట్రాకింగ్‌, చికిత్స, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని రాష్ట్రాలకు సూచించింది. దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ XXB దడ పుట్టిస్తోంది. ఇప్పటివరకూ వైరస్‌ మ్యుటేషన్‌ 216 సార్లు జరిగినట్లు నిపుణులు గుర్తించారు. ఎప్పటికప్పుడు వైరస్‌ వెర్షన్‌ మార్చుకొని కొత్త వేరియంట్‌గా రూపాంతరం చెందుతోంది. ఈ కొత్త వేరియంట్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ద్వారా గుర్తిస్తూ రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది కేంద్రం. అయితే, ఇప్పటివరకూ రూపాంతరం చెందిన అన్ని వేరియంట్లపై కోవిడ్ వ్యాక్సిన్‌ ప్రభావంతంగా పని చేస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా వెల్లడించారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.

ఇదిలాఉంటే.. కరోనా కొత్త వేరియంట్‌పై దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో మాక్‌డ్రిల్‌ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. టెస్టింగ్‌, ట్రాకింగ్‌, ట్రీట్‌మెంట్‌తో పాటు మందులు, ఐసీయూ సదుపాయాలు, పడకలు, వైద్య పరికరాలు, మెడికల్‌ ఆక్సిజన్‌ లభ్యత వంటి వివరాలపై అన్ని జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్య కేంద్రాలు ఈ మాక్‌డ్రిల్‌లో పాల్గొనాలంటూ కేంద్రం, ఐసీఎంఆర్‌ ఉమ్మడిగా అడ్వైజరీని జారీ చేశాయి. అయితే కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. తాజాగా కరోనాతో ఆరుగురు చనిపోవడంలో కలకలం రేపుతోంది.

కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దని, క్రియాశీలకంగా రాష్ట్రాలు వ్యవహరించాలని కేంద్రం కోరింది. ఈ వ్యాధి కారణంగా ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ తీవ్రతను తగ్గించేందుకు మాస్కులు ధరించడంతో పాటు అన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరముందని కేంద్రం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..