NPS Rule Change: వినియోగదారులకు అలర్ట్.. ఎన్‌పీఎస్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కోసం కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త రూల్‌ ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. నేషనల్‌ పెన్షన్‌ అనేది పెన్షన్‌..

NPS Rule Change: వినియోగదారులకు అలర్ట్.. ఎన్‌పీఎస్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తున్నారా? ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు
Nps Rule Change
Follow us
Subhash Goud

|

Updated on: Mar 16, 2023 | 5:30 AM

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కోసం కొత్త నిబంధనలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త రూల్‌ ఏప్రిల్ 1, 2023 నుంచి అమలులోకి వస్తుంది. నేషనల్‌ పెన్షన్‌ అనేది పెన్షన్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌. రిటైర్‌మెంట్‌ తర్వాత స్థిరమైన పెన్షన్‌ అందుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తానికి మెరుగైన ఆదాయం, పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఎన్‌పీఎస్‌ను పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నిర్వహిస్తుంది.

అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్ నుంచి నగదు విత్ డ్రా చేసుకోవడానికి కొత్త నిబంధనలు అమలు చేయబోతున్నారు. ఈ నిబంధన ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. కొత్త నిబంధన ప్రకారం కొన్ని పత్రాలను ఇవ్వడం తప్పనిసరి. చందాదారులు ఈ పత్రాలను అప్‌లోడ్ చేయకపోతే.. వారు ఎన్‌పీఎస్ నుంచి నగదు ఉపసంహరించుకోలేరని గుర్తించుకోండి. ఈ మేరకు పీఎఫ్‌ఆర్డీఏ ఉత్తర్వులు జారీ చేసింది. చందాదారులకు కేవైసీ పత్రాలు సమర్పించడమం తప్పనిసరి అని, ఈ పత్రాలను కచ్చితంగా అప్‌లోడ్ చేసేలా చూడాలని నోడల్ అధికారులు, చందాదారులను పీఎఫ్ఆర్డీఏ కోరింది. ఈ డాక్యుమెంట్లలో ఏదైనా తప్పులు కనిపిస్తే.. అప్పుడు ఎన్‌పీఎస్ నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది.

నగదు విత్‌డ్రా చేసుకునే ముందు మీరు ఎన్‌పీఎస్ ఉపసంహరణ ఫారమ్‌ను అప్‌లోడ్ చేశారో లేదో ముందుగానే నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. గుర్తింపు కార్డు, చిరునామా పత్రాల ప్రకారం ఉపసంహరణ ఫారమ్‌లోని సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఖాతా ప్రూఫ్‌, పాన్ లేదా శాశ్వత పదవీ విరమణ ఖాతా నంబర్ కార్డ్ కాపీ కూడా ఉండాలి. ఈ పత్రాలలో దేనినైనా అప్‌లోడ్ చేయకపోతే.. ఎన్‌పీఎస్ నుంచి డబ్బును ఉపసంహరించుకోలేరు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి