Income Tax Notice: పిల్లల పేరుతో ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు.. అసలు సంగతేంటో తెలుసా..?

కొన్ని సందర్భాలలో కొందరికి ఆదాయపు పన్ను నోటీసులు వస్తుంటాయి. అయితే ఆదాయానికి మించి ఆస్తులుండగా, లావాదేవీలు జరిగి ట్యాక్స్‌ కట్టని సమయంలో, లెక్కలు చూపని సమయంలో ఆ వ్యక్తికి నోటీసు రావడం సహజమే. అయితే ఓ ఉన్నతమైన వ్యక్తికి నోటీసు వస్తే కొంత షాక్‌కు గురవుతుంటాము. అలా ..

Income Tax Notice: పిల్లల పేరుతో ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు.. అసలు సంగతేంటో తెలుసా..?
Income Tax Notice
Follow us
Subhash Goud

|

Updated on: Mar 24, 2023 | 7:03 PM

కొన్ని సందర్భాలలో కొందరికి ఆదాయపు పన్ను నోటీసులు వస్తుంటాయి. అయితే ఆదాయానికి మించి ఆస్తులుండగా, లావాదేవీలు జరిగి ట్యాక్స్‌ కట్టని సమయంలో, లెక్కలు చూపని సమయంలో ఆ వ్యక్తికి నోటీసు రావడం సహజమే. అయితే ఓ ఉన్నతమైన వ్యక్తికి నోటీసు వస్తే కొంత షాక్‌కు గురవుతుంటాము. అలా కాకుండా తన పిల్లల పేరుతో కుటుంబానికి చేరినట్లయితే పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. అయితే ఇటీవల చాలా మంది చిన్నారులకు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు అందాయి. దేశవ్యాప్తంగా చాలా మంది చిన్నారులు, మైనర్ల పేరుతో ఆదాయపు పన్ను శాఖ ఇటీవల నోటీసులు జారీ చేసింది. నిజానికి ఈ కేసులన్నింటిలోనూ పిల్లల తల్లిదండ్రులు వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఈ ఖాతా నుంచి విదేశాలకు డబ్బు పంపించారు.

విదేశాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశంపై నోటీసులు జారీ చేసింది ఆదాయపు. భారతదేశంలోని చాలా మంది ప్రభావవంతమైన వ్యక్తులు విదేశాలలో ఆస్తులను కొనుగోలు చేయడానికి, షేర్లలో పెట్టుబడి పెట్టడానికి, బ్యాంక్ ఖాతాలను నిర్వహించడానికి ఇటువంటి ఖాతాలను ఉపయోగిస్తున్నారు. తన పిల్లలు లేదా మైనర్ల పేరుతో తెరిచిన బ్యాంకు ఖాతాల నుంచి నగదు బదిలీ చేస్తున్నాడు. ఇందులో అతను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ నుంచి కూడా సహాయం పొందుతున్నాడు. ఆర్బీఐ ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం అంటే ఏమిటో తెలుసుకుందాం.

2.5 లక్షల డాలర్ల వరకు విదేశాలకు పంపవచ్చు:

ఎల్‌ఆర్‌ఎస్ పథకంలో ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాను ఉపయోగించి విదేశాలకు కూడా డబ్బు పంపవచ్చు. ఇందులో పిల్లల పేరుతో తెరిచిన ఖాతాలు కూడా ఉన్నాయి. నియంత్రణ సమస్యలను నివారించడానికి ఈ నియమం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద ఒక వ్యక్తి సంవత్సరానికి గరిష్టంగా 2.5 లక్షల డాలర్లు (సుమారు రూ. 2.06 కోట్లు) మాత్రమే విదేశాలకు పంపొచ్చు. కుటుంబ సభ్యులందరి బ్యాంకు ఖాతాలన్నింటినీ కలిపి ఈ మొత్తాన్ని పంపవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆర్బీఐ పథకం ఉన్నప్పటికీ నోటీసు ఎలా వచ్చింది?

ఇప్పుడు మీ మదిలో ఒక ప్రశ్న తలెత్తవచ్చు. ఈ పథకం ఆర్‌బీఐది అయినప్పుడు, ప్రజలకు ఆదాయపు పన్ను నోటీసులు ఎందుకు వస్తున్నాయి..? అని. అది కూడా పిల్లల పేరుతో తెరిచిన ఖాతాలలో లావాదేవీలకు సంబంధించి. ఇలా లావాదేవీలు చేయడం ద్వారా పెట్టుబడులు పెట్టగల విదేశీ ఆస్తుల జాబితాను ఆర్‌బీఐ సిద్ధం చేసింది. ఒక వ్యక్తి తన వార్షిక ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఇలాంటి పెట్టుబడుల గురించి సమాచారం ఇవ్వనప్పుడు ఈ విదేశీ పెట్టుబడులపై ఆదాయపు పన్ను శాఖ కన్ను పడింది.

ఇప్పుడు పిల్లలు లేదా మైనర్లకు నేరుగా ఎలాంటి స్వతంత్ర ఆదాయం లేదు. అటువంటి పరిస్థితిలో అతని పాన్ నంబర్‌పై ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయరాదు. అందువల్ల ఈ నోటీసులకు సంబంధించి పిల్లల తల్లిదండ్రులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఈ లావాదేవీల గురించి సమాచారం ఇచ్చారా లేదా అని ఆదాయపు పన్ను శాఖ వారి ద్వారా తెలుసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. భారతదేశంలోని వ్యక్తులు తమ ఆదాయపు పన్ను రిటర్న్ ఫారమ్‌లలో విదేశీ బ్యాంకు ఖాతాలు, ఆస్తులలో తమ పెట్టుబడులను వెల్లడించవలసి ఉంటుంది. అలా చేయకుంటే రూ.10 లక్షల వరకు జరిమానా విధించే నిబంధన ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి