Aadhaar Card: ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆధార్ కార్డు ఏమవుతుంది..? ఆటో డిసేబుల్ సిస్టమ్ వస్తుందా?

దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు దుర్వినియోగం అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన వారి ఆధార్ కార్డు కూడా కొన్ని సందర్భాల్లో వినియోగిస్తున్నారు. వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతని ఆధార్ కార్డు చెక్కుచెదరకుండా ఉండడం చూసే ఉంటారు. ఇప్పుడు దీనిని నివారించడానికి, ప్రభుత్వం కొత్త యంత్రాంగాన్ని..

Aadhaar Card: ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని ఆధార్ కార్డు ఏమవుతుంది..? ఆటో డిసేబుల్ సిస్టమ్ వస్తుందా?
Aadhaar Card
Follow us
Subhash Goud

|

Updated on: Mar 23, 2023 | 9:30 PM

దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు దుర్వినియోగం అనేక కేసులు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన వారి ఆధార్ కార్డు కూడా కొన్ని సందర్భాల్లో వినియోగిస్తున్నారు. వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా అతని ఆధార్ కార్డు చెక్కుచెదరకుండా ఉండడం చూసే ఉంటారు. ఇప్పుడు దీనిని నివారించడానికి, ప్రభుత్వం కొత్త యంత్రాంగాన్ని అమలు చేస్తుంది. UIDAI, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేసే విధానాన్ని తీసుకువస్తున్నారు. ఈ కొత్త విధానంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మరణానికి సంబంధించిన అఫిడవిట్ ఇచ్చిన తర్వాత అతని ఆధార్ కార్డును డీయాక్టివేట్ చేసే ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది.

చనిపోయిన వ్యక్తి ఆధార్‌ను డీయాక్టివేట్ చేయడం ఎలా ?

ఏ పౌరుడు మరణించినా తప్పనిసరిగా జనన మరణ రికార్డులలో నమోదు చేయబడాలి. అందువల్ల, మరణాన్ని నమోదు చేసేటప్పుడు వ్యక్తి ఆధార్ నంబర్ తప్పనిసరి. మరణ ధృవీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు వ్యక్తి కుటుంబ సభ్యుల అనుమతితో ఆధార్ కార్డ్ డియాక్టివేట్ చేయబడుతుంది. ఇది ఇప్పుడు అమలులోకి రానున్న కొత్త వ్యవస్థ.

అటువంటి వ్యవస్థ కోసం మొదటి ప్రతిపాదనను రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా చేసింది.మరణ ధృవీకరణ పత్రం జారీ చేసేటప్పుడు ఆధార్ పత్రాలను పొందడం గురించి UIDAIని సంప్రదించారు . ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డును తొలగించేందుకు రెండు సంస్థలు సంయుక్తంగా కొత్త విధానాన్ని అమలు చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

జూన్ 14 వరకు ఉచిత ఆధార్ అప్‌డేట్:

ఎలాంటి రుసుము లేకుండా ఆధార్ కార్డుకు పత్రాలను జోడించడానికి జూన్ 14 వరకు అనుమతి ఉంది. ఈ ఉచిత సేవ ఆధార్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. ఇంతకు ముందు ఆధార్ డాక్యుమెంట్ అప్‌డేట్ కోసం 25 రూపాయల ఫీజు వసూలు చేసేవారు.

ఆధార్ కార్డు ఉన్నవారు ప్రతి పదేళ్లకోసారి తమ రికార్డులను అప్‌డేట్ చేయాలని కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీని కోసం ID రుజువు, చిరునామా రుజువు పత్రాలను సమర్పించాలి. వీటిని ఎలాంటి ఛార్జీలు లేకుండా ఆధార్ పోర్టల్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. జూన్ 14 తర్వాత రుసుము చెల్లించి పత్రాన్ని అప్‌డేట్ చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి