Income Tax Rules: వినియోగదారులకు అలర్ట్‌.. ఇంకా మూడు రోజులే గడువు.. ఏప్రిల్‌ 1 నుంచి ఆదాయపు పన్ను శాఖలో కొత్త నిబంధనలు

మార్చి నెల ముగియబోతోంది. ఏప్రిల్‌ నెల రాబోతోంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆదాయపు పన్ను విషయంలో పలు నిబంధనలు మారనున్నాయి. అయితే ఇంకా మూడే రోజుల గడువు ఉంది. వినియోగదారులు ఈ నిబంధనలు ఏమిటో లెలుసుకోవడం చాలా ముఖ్యం. మరో మూడు రోజుల్లోగా ఆదాయపు పన్నును మార్చి 31లోగా..

Income Tax Rules: వినియోగదారులకు అలర్ట్‌.. ఇంకా మూడు రోజులే గడువు.. ఏప్రిల్‌ 1 నుంచి ఆదాయపు పన్ను శాఖలో కొత్త నిబంధనలు
Income Tax
Follow us
Subhash Goud

|

Updated on: Mar 28, 2023 | 8:20 AM

మార్చి నెల ముగియబోతోంది. ఏప్రిల్‌ నెల రాబోతోంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆదాయపు పన్ను విషయంలో పలు నిబంధనలు మారనున్నాయి. అయితే ఇంకా మూడే రోజుల గడువు ఉంది. వినియోగదారులు ఈ నిబంధనలు ఏమిటో లెలుసుకోవడం చాలా ముఖ్యం. మరో మూడు రోజుల్లోగా ఆదాయపు పన్నును మార్చి 31లోగా సమర్పించాలి. దేశ ప్రజలలో అధిక భాగం ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తారు. మీరు కూడా ఈ ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తే, కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను సమర్పణ నిబంధనలు మారుతున్నాయి. మీకు ఈ నియమాలు తెలియకపోతే, ఆదాయపు పన్ను దాఖలు చేసేటప్పుడు మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త ఆదాయపు పన్ను నిబంధనలలో పన్ను మినహాయింపు పరిమితులు కూడా మారాయి.

ఆదాయపు పన్ను నిబంధనలలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?

కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ రూల్ ప్రకారం రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. గతంలో ఈ పన్ను మినహాయింపు రూ.5 లక్షలకు పరిమితమైంది. అంటే వార్షిక ఆదాయం రూ.7 లక్షలు ఉన్న వ్యక్తి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి
  • పాత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు రూ.50,000 వరకు ఆదాయపు పన్ను మినహాయింపు పొందేవారు. కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, రిటైర్డ్ ఉద్యోగులు రూ.15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఆదాయంపై రూ.52,500 వరకు తగ్గింపు పొందుతారు.
  • ప్రయివేటు ఉద్యోగుల విషయానికొస్తే, లీవ్ క్యాష్‌మెంట్ పరిమితి రూ.3 లక్షలు. ఈ ఆర్థిక పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచారు.
  • ఏప్రిల్ 1 నుంచి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులపై స్వల్పకాలిక మూలధన లాభాల కింద పన్ను విధించబడుతుంది.
  • ఎల్‌ఐసీ వార్షిక ప్రీమియం రూ. 5 లక్షలు అయితే దాని ద్వారా వచ్చే ఆదాయం కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను పరిధిలోకి వస్తుంది.
  • సీనియర్ సిటిజన్ పథకంలో గరిష్ట డిపాజిట్ పరిమితిని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచారు

కొత్త ఆదాయపు పన్ను పరిమితి:

  • 3 లక్షల వరకు సంపాదనపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
  • 3 నుంచి 6 లక్షల రూపాయల మధ్య ఆదాయం ఉన్నట్లయితే 5% వరకు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
  • 6 నుంచి 9 లక్షల రూపాయల మధ్య ఆదాయంపై 10 శాతం ఆదాయపు పన్నును డిపాజిట్ చేయాలి.
  • 9 నుంచి 12 లక్షల రూపాయల మధ్య ఆదాయంపై 15 శాతం ఆదాయపు పన్నును డిపాజిట్ చేయాలి.
  • రూ.12 నుంచి రూ.15 లక్షల మధ్య వార్షిక ఆదాయాలపై 20 శాతం చొప్పున ఆదాయపు పన్ను చెల్లించాలి.
  • 15 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లయితే ఆదాయపు పన్ను 30 శాతం చొప్పున డిపాజిట్ చేయాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి