Crypto Currency: కేంద్ర కీలక నిర్ణయం.. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కిందకు క్రిప్టో కరెన్సీ

అవినీతిని రూపు మాపేందుకు మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతిని నిర్మూలించాలనే ఉద్దేశంతో క్రిప్టో కరెన్సీకి సంబంధించి కీలక..

Crypto Currency: కేంద్ర కీలక నిర్ణయం.. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కిందకు క్రిప్టో కరెన్సీ
Crypto Currency
Follow us
Subhash Goud

|

Updated on: Mar 21, 2023 | 7:11 PM

అవినీతిని రూపు మాపేందుకు మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతిని నిర్మూలించాలనే ఉద్దేశంతో క్రిప్టో కరెన్సీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ సంపదపై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసే లక్ష్యంతో క్రిప్టో కరెన్సీ రంగానికి మనీలాండరింగ్ చట్టాన్ని వర్తింప చేయాలని నిర్ణయించింది.

ఈ నిర్ణయం తర్వాత దేశంలో క్రిప్టోకరెన్సీ ద్వారా ఏదైనా చట్టవిరుద్ధమైన పనిని నిర్వహించడం కష్టం. డిజిటల్ ఆస్తుల పర్యవేక్షణను కఠినతరం చేసే లక్ష్యంతో ప్రభుత్వం క్రిప్టోకరెన్సీల వంటి డిజిటల్ ఆస్తులపై మనీలాండరింగ్ నిరోధక నిబంధనలను అమలు చేసింది కేంద్రం. అంటే మనీలాండరింగ్‌కు సంబంధించిన భారత చట్టాలు ఇప్పుడు క్రిప్టోకరెన్సీల ట్రేడింగ్‌కు కూడా వర్తిస్తాయన్నమాట. అటువంటి ఆస్తులకు ఇప్పుడు మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 వర్తిస్తుందని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

అయితే క్రిప్టో లావాదేవీల కోసం మనీలాండరింగ్ నిరోధక చట్టం అమలులోకి వచ్చినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల గెజిట్ నోటిఫికేషన్‌లో పేర్కొంది. భారతీయ క్రిప్టో ఎక్స్ఛేంజీలు అనుమానాస్పద కార్యకలాపాలను ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU)నివేదించాలి. ఇది కాకుండా, వర్చువల్ డిజిటల్ అసెట్స్ (వీడీఏ)తో వ్యవహరించే క్రిప్టో ఎక్స్ఛేంజీలు, మధ్యవర్తులు ఇప్పుడు తమ కస్టమర్‌లు, ప్లాట్‌ఫారమ్ వినియోగదారుల కేవైసీ చేయాల్సి ఉంటుంది. వీడీఏలో పనిచేస్తున్న ఎంటిటీలు పీఎంఎల్‌ఏ కింద రిపోర్టింగ్ ఎంటిటీగా పరిగణించబడతాయి.

ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ చట్టం ప్రతి రిపోర్టింగ్ సంస్థ అన్ని లావాదేవీల రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీలను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పిఎమ్‌ఎల్‌ఎ) కిందకు తీసుకువచ్చే కేంద్రం కొత్త నోటిఫికేషన్‌ను పరిశ్రమ స్వాగతించింది. కాయిన్‌డిసిఎక్స్ నుంచి సమ్మతిని పొందింది. క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఆపరేటర్ కాయిబ డీటీఎక్స్‌ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) రిజిస్టర్డ్ రిపోర్టింగ్ ఎంటిటీగా మారింది. ఇది క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్ ఆపరేటర్‌ను ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కిందకు తీసుకువచ్చింది.

క్రిప్టో పూర్తిగా ప్రైవేట్ కరెన్సీ. లీగల్ కరెన్సీ కాదు. ఏ ప్రభుత్వమూ పర్యవేక్షించదు. అలాగే ఏ ప్రభుత్వం లేదా కేంద్ర బ్యాంకు దానిపై నియంత్రణ కలిగి ఉండదు. దీని ద్వారా డిజిటల్ పద్ధతిలో లావాదేవీలు జరపవచ్చు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా, క్రిప్టోకరెన్సీని వివిధ ప్రదేశాలలో నిల్వ చేస్తారు.

భారతదేశపు ప్రముఖ, అత్యంత విలువైన క్రిప్టో కంపెనీ కాయిన్‌ డీసీఎక్స్‌. మార్చి, 2023లో భారత ప్రభుత్వం ప్రకటించిన కొత్త మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం.. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU) ద్వారా రిజిస్టర్డ్ రిపోర్టింగ్ సంస్థగా మారింది. కాయిన్ డీసీఎక్స్ కస్టమర్లు తమ క్రిప్టో పని చేసేలా, క్రిప్టో అసెట్స్ పై వడ్డీ ఆర్జించేలా చేసే నూతన మార్గమిది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ), 2022 ప్రకారం కస్టమర్ల కేవైసీ ధృవీకరణను నిర్వహించడానికి వారి రికార్డులను నిర్వహించడానికి రిపోర్టింగ్‌ సంస్థ అవసరం.

ఈ సందర్భంగా కాయిన్ డీసీఎక్స్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సుమిత్ గుప్తా మాట్లాడుతూ .. మనీ లాండరింగ్ నిరోధక చట్టం, 2002 (పీఎంఎల్‌ఏ) కింద వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ పరిశ్రమను చేర్చడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యను స్వాగతిస్తున్నామని అన్నారు. ఇది వీడీఏల ద్వారా జవాబుదారీతనం, ఉత్తమ పద్ధతుల అమలును పెంచడానికి మార్గం సుగమం చేస్తుందని ఆయన అన్నారు.

నియమాలు, విధానాలను అనుసరించి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్‌ఐయూ) నమోదిత రిపోర్టింగ్ ఎంటిటీ అయినందుకు సంతోషిస్తున్నామన్నారు. పరిశ్రమలు వృద్ధి చెందుతున్నందున నమ్మకంతో పాటు పారదర్శకతను పెంపొందించుకుంటామని, వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ సురక్షితంగా చేయడానికి వాటాదారులకు అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుందన్నారు.

అయితే ఈ వర్చువల్‌ డిజిటల్‌ అసెట్స్‌ (వీడీఏ)లో అగ్రగామిగా కాయిన్‌ డీసీఎక్స్‌ 2018 నుంచి వీడీఏని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. ఈ వీడిఏ, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ప్రాథమిక విషయాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కంపెనీ ప్రధాన దృష్టి సారిస్తోంది. కంపెనీ కేవైసీ నిబంధనలకు కట్టుబడి కొనసాగుతుంది. అలాగే వారి కస్టమర్ల నుంచి సంబంధిత సమాచారాన్ని పొందడం ద్వారా, వారి ప్లాట్‌ఫారమ్‌లో చేసిన అన్ని లావాదేవీల సరైన రికార్డులను నిర్వహించడం ద్వారా నిర్ధేశించిన సమయంలో ఎఫ్‌ఐయూకి ఏవైనా అనుమానాస్పద లావాదేవీలను నివేదించడం ద్వారా చట్టాలకు మరింతగా కట్టుబడి ఉంటుంది. అలాగే పీఎంఎల్‌ఏ కింద అన్ని నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా బాధ్యత వహించాలి అని అన్నారు. 15 మిలియన్ల వినియోగదారులకు సేవలందిస్తున్న క్రిప్టో ఎక్స్ఛేంజ్ ఆపరేటర్.. కేవైసీ నిబంధనలు, భూ చట్టానికి కట్టుబడి కొనసాగుతుందని చెప్పారు.