Hero Splendor Plus XTec: చవకైన ధరలో బెస్ట్ బైక్ ఇదే.. గ్రాండ్ లుక్.. టాప్ ఫీచర్లు..

|

Aug 24, 2023 | 5:00 PM

దేశంలోని అతి తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉన్న బైక్ లలో ఇప్పటికీ ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. కాగా హీరో కంపెనీ ఈ స్ప్లెండర్ కొత్త మోడల్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్ పేరుతో దేశంలోని అత్యంత చవకైన ద్విచక్ర వాహనంగా దీనిని ఆవిష్కరించింది. ఇది దేశీయ మార్కెట్లో మైలేజీ ఆప్షన్లలో బెస్ట్ గా నిలుస్తోంది. దీని ధర రూ. 79వేలుగా ఉంది.

Hero Splendor Plus XTec: చవకైన ధరలో బెస్ట్ బైక్ ఇదే.. గ్రాండ్ లుక్.. టాప్ ఫీచర్లు..
Hero Splendor Plus Xtec
Follow us on

హీరో, హొండా కంపెనీలు విడపోకముందు, అంటే హీరోహోండాగా కలిసి ఉన్న సమయంలో ఆ సంస్థ నుంచి వచ్చిన ద్విచక్ర వాహనాల్లో అత్యంత ప్రజాదరణ పొందింది హీరోహోండా స్ప్లెండర్. పనితీరు, మైలేజీ, లుక్ అన్నింట్లోనూ తిరుగులేని విధంగా ఉండేది. దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బైక్ లలో ఇదే ప్రథమ స్థానంలో ఉండేది. అయితే ఆ కంపెనీ రెండు విడిపోవడం, పైగా వివిధ కంపెనీల నుంచి విభిన్న మోడల్స్ అందుబాటులోకి రావడంతో హీరో పరిధిలోకి వెళ్లిన స్ప్లెండర్ కు డిమాండ్ తగ్గింది. అయినప్పటికీ దేశంలోని అతి తక్కువ బడ్జెట్లో అందుబాటులో ఉన్న బైక్ లలో ఇప్పటికీ ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. కాగా హీరో కంపెనీ ఈ స్ప్లెండర్ కొత్త మోడల్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్ పేరుతో దేశంలోని అత్యంత చవకైన ద్విచక్ర వాహనంగా దీనిని ఆవిష్కరించింది. ఇది దేశీయ మార్కెట్లో మైలేజీ ఆప్షన్లలో బెస్ట్ గా నిలుస్తోంది. దీని ధర రూ. 79వేలుగా ఉంది. హీరో కంపెనీ సింగిల్ వేరియంట్ దీనిని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్ బైక్ లో 100సీసీ బీఎస్6 ఇంజిన్ ఉంటుంది. దీనిలో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. ముందు వెనుక డ్రమ్ బ్రేకులు ఉంటాయి. ఈ ద్విచక్ర వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇంజిన్ సామర్థ్యం ఇది.. హీరో స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్ బైక్ లో 100సీసీ సింగిల్ సిలెండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 6000ఆర్పీఎం వద్ద గరిష్టంగా 8బీహెచ్ పీ, 8.05ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ నాలుగు గేర్ల స్పీడ్ ట్రాన్స్ మిషన్ జోడించి ఉంటుంది.

వేరియంట్లు.. హీరో కంపెనీ ప్రస్తుతానికి సింగిల్ డ్రమ్ బ్రేకులతో కూడిన వేరియంట్ నే విడుదల చేసింది. మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. బ్లూ, గ్రే, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

పూర్తి స్పెసిఫికేషన్లు ఇవి..

హీరో స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్ బైక్ లో ఇంజిన్ సామర్థ్యం 97.2 సీసీ ఉంటుంది. ఒక లీటర్ పెట్రోల్ కి మైలేజీ 60 లీటర్లు వస్తుంది. 4 స్పీడ్ మాన్యూల్ ట్రాన్స్ మిషన్ ఉంటుంది. కెర్బ్ వెయిట్ 112 కేజీలు ఉంటుంది. ఇంధన ట్యాంక్  సామర్థ్యం 9.8 లీటర్లు ఉంటుంది. సీటు ఎత్తు  785ఎంఎం వరకూ ఉంటుంది. తక్కువ ధరలో అధిక పనితీరు కలిగిన బైక్ కావాలనుకొనే వారికి ఇదే బెస్ట్ ఆప్షన్.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..