Retirement Plan: రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే.. ఇలా చేయడం తప్పనిసరి..

Savings: నేటి ఆధునిక కాలంలో కాస్ట్ ఆఫ్‌ లివింగ్ బాగా పెరుగుతోంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో రూపాయి ఆదాయం ఉంటే అర్థ రూపాయి మిగిలేది.. నేడు మాత్రం రూపాయి సంపాదిస్తే..

Retirement Plan: రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే.. ఇలా చేయడం తప్పనిసరి..
Money
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 28, 2022 | 9:46 AM

Savings: నేటి ఆధునిక కాలంలో కాస్ట్ ఆఫ్‌ లివింగ్ బాగా పెరుగుతోంది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో రూపాయి ఆదాయం ఉంటే అర్థ రూపాయి మిగిలేది.. నేడు మాత్రం రూపాయి సంపాదిస్తే మరో రూపాయి అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో భవిష్యత్తులో లేదా రిటైర్మెంట్‌ తర్వాత ఆర్థిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. ప్రస్తుతం పింఛను గ్యారంటీ లేని ఉద్యోగాలు కావడంతో రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎలా ఉండబోతుందనే ఆలోచన సర్వ సాధారంగా వస్తుంది. అయితే మొదటి నుంచి ఓ ప్రణాళిక ప్రకారం లైఫ్ ప్లాన్ చేసుకుంటే.. భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. అదే నిర్లక్ష్యంగా ఉంటే రిటైర్మెంట్ తర్వాత.. ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఉద్యోగం చేస్తున్నంత సేపు ప్రతి నెలా జీతం వస్తుంది కాబట్టి.. మన అవసరాలు తీర్చుకుంటాం. కాని రిటైర్మెంట్ అయిన తర్వాత నెలవారీ జీతం రాదు. అందుకే ఉద్యోగ విరమణ తర్వాత కూడా నెలవారీ జీతం తరహాలో కొంత ఆదాయం వచ్చేలా ప్లాన్ చేసుకోవల్సి ఉంటుంది. మరోవైపు ఏవైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాటి కోసం కూడా పెద్ద మొత్తంలో నగదు అవసరం అవుతుంది. ఉద్యోగ విరమణ తర్వాత బ్యాంకు రుణాలు పొందటం కష్టం అవుతుంది. అందుకే ముందునుంచి భవిష్యత్తు అవసరాలకు తగినట్లుగా సరైన ప్రణాళికతో ముందుకెళ్లాల్సి ఉంటుంది.

రిటైర్మెంట్ ప్లాన్ అందరికీ ఒకేలా ఉండదు. ఒక్కోకరిది ఒక్కో విధంగా ఉంటుంది. భవిష్యత్తు కోసం చేసే పొదుపు వ్యక్తి యొక్క నెలవారీ ఆదాయం, అతడి ఆర్థిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. చేసే ఉద్యోగం ఆధారంగా కూడా మన పొదుపు ఆధారడి ఉంటుంది. ఉద్యోగ విరమణ తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొంత వరకూ ఆరోగ్య బీమా కవరేజ్ ఉంటుంది. కానీ ప్రైవేట్ ఉద్యోగులకు ఆ వెసులుబాటు ఉండదు. ఇలాంటి విషయాలన్నీ క్షుణ్నంగా ఆలోచించి మన అవసరాలకు తగినట్టుగా రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోవాలి. ఉద్యోగ విరమణ తర్వాత మన భవిష్యత్తును ప్లాన్ చేసుకునే విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాని ముందునుంచి సరిగ్గా ప్లాన్ చేసుకున్న వ్యక్తి రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు.

ప్రతి వ్యక్తి ఆరోగ్య బీమా తగినంత ఉందో లేదో చూసుకుని ఒకవేళ తగినంత లేకపోతే కొత్తది తీసుకోవాలి. తాము తీసుకున్న ఆరోగ్య బీమా మధుమేహం, రక్తపోటు లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పాలసీలో ఆ వ్యాధులకు కవరేజ్ లేకపోతే వాటికి కవరేజ్ ఇచ్చే టాప్‌అప్ లేదా కొత్త పాలసీ ఎంచుకోవాలి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తప్పకుండా తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఆరోగ్య బీమా తర్వాత అత్యంత ముఖ్యమైనది జీవిత బీమా.. ఏదైనా దురదృష్టకరమైన పరిస్థితులు జరిగినప్పుడు.. కుటుంబాన్ని కాపాడే మొదటి రక్షణ కవచం జీవిత బీమా. లైఫ్ ఇన్య్సూరెన్స్ లేకపోతే.. ప్రస్తుతం మనం పొందే అవకాశం ఉంటే వెంటనే జీవిత బీమా తీసుకోవాలి. చాలా కంపెనీలు యాభై ఏళ్లు దాటినవారికి జీవిత బీమా పాలసీ ఇచ్చేందుకు విముఖత చూపిస్తాయి. ఎన్నో ప్రశ్నలు వేసి పాలసీని తిరస్కరిస్తుంటాయి. కాబట్టి మన పరిస్థితిని బట్టి పాలసీ కోసం జాగ్రత్తగా ప్రయత్నించాలి. ఈ రెండు బీమా పాలసీలు మన రిటైర్మెంట్ ప్లానింగ్ విషయంలో అంతర్భాగమని గుర్తించాలి. ఎందుకంటే రిటైర్మెంట్ వయసు దగ్గర పడే కొద్దీ ఈ బీమా ప్రీమియం కూడా పెరుగుతుంది. కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బీమా తీసుకోవడం మంచిది. ఈ రెండూ ఉంటే మన జీవితం ఉద్యోగ విరమణ తర్వాత కూడా సాఫీగా గడిచిపోతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..