Pulsar Bikes : మార్కెట్‌లోకి 2023 పల్సర్ బైక్స్.. ఇక ఆ బైక్స్‌కు గట్టి పోటీనే..!

బజాజ్ ఆటో ఇటీవల భారతదేశంలో తన పల్సర్ ఎన్ఎస్ నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ లైన్‌కు అప్డేట్ వెర్షన్‌ను విడుదల చేసింది. తాజాగా 2023 మోడల్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 రూ.1.35 లక్షల ధరకు అందుబాటులో ఉంది. 

Pulsar Bikes : మార్కెట్‌లోకి 2023 పల్సర్ బైక్స్.. ఇక ఆ బైక్స్‌కు గట్టి పోటీనే..!
Bajaj Pulsar
Follow us
Srinu

|

Updated on: Mar 15, 2023 | 5:30 PM

యువతను ఎక్కువగా ఆకట్టుకున్న బజాజ్ పల్సర్ బైక్స్‌లో కొత్త వెర్షన్లు మార్కెట్‌లోకి రిలీజ్ అయ్యాయి. బజాజ్ ఆటో ఇటీవల భారతదేశంలో తన పల్సర్ ఎన్ఎస్ నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ లైన్‌కు అప్డేట్ వెర్షన్‌ను విడుదల చేసింది. తాజాగా 2023 మోడల్ బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 రూ.1.35 లక్షల ధరకు అందుబాటులో ఉంది.  అయితే పల్సర్ ఎన్ 200 రూ.1.47 లక్షలకు అందుబాటులో ఉంది. కొత్త ఫీచర్లను చేర్చడం వల్ల ఈ మోటార్‌సైకిళ్ల ధర వాటి మునుపటి వెర్షన్‌లతో పోలిస్తే రూ.10,000 వరకు పెరిగిందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి .  ఎన్ఎస్ 160 టీవీఎస్ అపాచీ 160 4వీ, హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్, హోండా ఎక్స్ బ్లేడ్ 160 వంటి మోడళ్లతో పోటీపడుతుంది. అయితే ఎన్ఎస్ 200 టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 200 4వీ, కేటీఎం డ్యూక్ 200 వంటి బైక్స్‌తో పోటీపడుతుంది.

ఫీచర్లు ఇవే

పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200 నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ బైక్‌లు వాటి మునుపటి మోడళ్లతో అద్భుతమైన పోలికతో ఉంటాయి. సూపర్ లుక్ కోసం యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్‌లను జోడించారు. ఈ మోటార్‌సైకిళ్లు పల్సర్ లైనప్‌లో ఇలాంటి ఫోర్క్‌లు కలిగి ఉన్న మొదటివి. అదనంగా, రెండు బైక్‌లు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్బర్‌తో వస్తాయి. ఇప్పుడు స్టాండర్డ్‌గా డ్యూయల్-ఛానల్ ఏబీఎస్‌తో వస్తున్నాయి. పల్సర్ ఎన్ఎస్ 160, ఎన్ఎస్ 200లో కొంచెం తేలికైన అల్లాయ్ వీల్స్‌తో ఆకట్టుకునేలా ఉన్నాయి. 

సూపర్ పవర్ ఇంజిన్స్

ఈ మోటార్‌సైకిళ్ల మెకానికల్ అంశాలు మారకపోయినా ఇంజిన్‌లు ఇప్పుడు ఓబీడీ-2కు అనుగుణంగా ఉన్నాయి. పల్సర్ ఎన్ఎస్ 160.3 సీసీ సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో 16.9 బీహెచ్‌పీ, 14.6 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. అలాగే పల్సర్ ఎన్ఎస్ 200 199.5 సీసీ, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో అమర్చారు. ఇది గరిష్టంగా 24.1 బీహెచ్‌పీ, 18.74 ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..