ఏపీ విద్యార్ధులకు ముఖ్య అలెర్ట్. శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని మార్చి 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు దినంగా ప్రకటించింది జగన్ సర్కార్. అలాగే ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది.
ఇక అటు రాష్ట్రంలో ఒంటిపూట బడులను ఏప్రిల్ 4వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో.. ఈ ఎగ్జామ్స్ నిర్వహించే సెంటర్ల(స్కూల్స్)లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు.
మరోవైపు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ఇవ్వనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అనంతరం జూన్ 12న స్కూల్స్ తిరిగి ప్రారంభం కానున్నాయి.