ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్ 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు మెయిన్స్ పరీక్షలను జూన్ మొదటి వారంలో నిర్వహించనున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.
సోమవారం యూపీఎస్సీ సివిల్స్ ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. సివిల్స్ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి గ్రూప్ 1 పరీక్ష రాసే 25మంది అభ్యర్థులు హాజరు కావాల్సిఉంది. వారిని దృష్టిలో పెట్టుకొని అధికారులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది జనవరి 8న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 87,718 మంది అభ్యర్థులు హాజరుకాగా.. 6,455 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించి మెయిన్ పరీక్షకు అర్హత పొందారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..