ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్లను సోమవారం (మార్చి 27) విడుదల చేసింది. రెవెన్యూ శాఖలో 670 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఏప్రిల్ 4వ తేదీన రెండు షిఫ్టుల్లో ఆన్‌లైన్ విధానంలో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలుపుతూ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దాదాపు 11,574 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు అర్హత సాధించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
కాగా ఏపీపీఎస్సీ గ్రూప్-4 ప్రిలిమినరీ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,11,341 మంది హాజరయ్యారు. వీరిలో 11,574 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. అర్హత సాధించిన అభ్యర్ధులందరికీ వచ్చేనెల 4వ తేదీన మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.