Pulasa Fish: దునియాలో ఏక్ నెంబర్.. పులస అదరహో.. ఎందుకంత డిమాండ్

| Edited By: Vimal Kumar

Aug 24, 2023 | 12:36 PM

గోదావరి జిల్లాల్లో దొరికే పులస చేపలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజుంది. వింటే భారతం వినాలి... తింటే పులసే తినాలి అనే రేంజ్‌లో ఉంటుంది దానికున్న ప్రయారిటీ. ఆ మాటకొస్తే చేపల మార్కెట్‌లో పులస అనేది ఒక తిరుగులేని బ్రాండు. వేలకువేలు పెట్టి వేలంలో పోటీ పడిమరీ కొంటారు పులస ప్రేమికులు. అలాగే పులస ధర ఇప్పుడు మరోసారి రికార్డులు బద్దలుకొట్టేసింది. పులస లేటెస్ట్ ఎమ్మార్పీ ఎంతన్న చర్చ మళ్లీమళ్లీ మారుమోగిపోతోంది. ఇంతకీ కిలో పులస ఎంత పలుకుతోందిప్పుడు?

పులస…ఈ పేరు వింటేనే నాన్‌వెజ్‌ ప్రియులకు నోరూరిపోతుంది. గోదావరి జిల్లాల్లో అయితే పులస క్రేజే వేరు. ఆ మాటకొస్తే ఫిష్ మార్కెట్‌లో పులస ప్రయారిటీనే సెపరేటు. పులసది తిరుగులేని బ్రాండ్‌. పుస్తెలమ్మినాసరే పులస తినాలంటారు గోదారోళ్లు. అనడమే కాదు, ఎంత రేటైనా పెట్టి కొని తింటారు. వేలంలో పోటీపడిమరీ వేలకు వేల రూపాయలు ఖర్చు చేస్తారు. దాంతో, పులస ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు క్రియేట్‌ చేస్తూ ఉంటుంది. ఈ ఏడాది కూడా పులస రికార్డులు బద్దలుకొట్టింది.