మరణించిన పక్షులతో కూడా అమెరికాలో విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నారు. వాటిని డ్రోన్ లుగా మార్చే ప్రకియపై కృషి చేస్తు్న్నారు. సాధారణ డ్రోన్లకు హెలికాప్టర్ తరహాలో అమర్చిన రెక్కలు తిరగడం మనం చూసే ఉంటాం. కానీ తాజాగా పరిశోధకులు తయారుచేస్తున్న డ్రోన్ లకు పక్షి రెక్కలుంటాయి. వాటిని అల్లార్చుతూనే ఈ డ్రోన్ ఎగరాల్సి ఉంటుంది. వాస్తవానికి సజీవంగా ఉన్న ఓ పక్షి తన రెక్కల సహాయంతో సులభంగా గాల్లో ఎగురుతుంది. కానీ అదే విధానంలో డ్రోన్‌ను ఎగరేయడం అసాధ్యం. అయితే అమెరికాలోని ‘న్యూ మెక్సికో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ టెక్నాలజీ’లో కొందరు పరిశోధకులు ఇందుకోసం నిరంతరం శ్రమిస్తున్నారు. చనిపోయిన పక్షులను డ్రోన్లుగా మారిస్తే అది విమానాల అధ్యయనానికీ సహాయపడుతుందని వారు చెబుతున్నారు. అలాగే దీనివల్ల ఎంతో శక్తిని, ఇంధనాన్ని ఆదా చేయవచ్చని భావిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం: Videos Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్.. Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో.. Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..