Leopard in TTD: అలిపిరి మెట్ల మార్గంలో మళ్లీ భయం భయం.. ఊపిరి పీల్చుకునేలోపే మరో చిరుత..

|

Aug 17, 2023 | 8:37 AM

తిరుమల కాలినడక మార్గంలో వెళ్లాలంటేనే భక్తులు వణికిపోతున్నారు. భక్తులను చిరుత పులుల భయం వెంటాడుతోంది. మెట్ల మార్గంలో చిన్నారిని బలితీసుకున్న చిరుత ఎట్టకేలకు చిక్కిందని ఊపిరి తీసుకునేలోపే ఇప్పడు మరో చిరుత, ఎలుగుబంటి ప్రత్యక్షం కావడంతో తిరుమలలో ఆందోళన నెలకొంది. నిన్న ఉదయం నడకదారికి దగ్గర్లో చిరుత పులి సంచరించినట్లు భక్తులు చెబుతున్నారు. కొందరు భక్తులు గుంపుగా..

తిరుమల కాలినడక మార్గంలో వెళ్లాలంటేనే భక్తులు వణికిపోతున్నారు. భక్తులను చిరుత పులుల భయం వెంటాడుతోంది. మెట్ల మార్గంలో చిన్నారిని బలితీసుకున్న చిరుత ఎట్టకేలకు చిక్కిందని ఊపిరి తీసుకునేలోపే ఇప్పడు మరో చిరుత, ఎలుగుబంటి ప్రత్యక్షం కావడంతో తిరుమలలో ఆందోళన నెలకొంది. నిన్న ఉదయం నడకదారికి దగ్గర్లో చిరుత పులి సంచరించినట్లు భక్తులు చెబుతున్నారు. కొందరు భక్తులు గుంపుగా వెళ్తున్న సమయంలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలోని నామాలగని దగ్గర.. చెట్ల మాటున చిరుతను గుర్తించిన భక్తులు భయంతో పరుగులు తీసారు. ఆ కాసేపటికే ఎలుగుబంటి కనిపించింది. దాంతో తీవ్ర భయాందోళన చెందిన భక్తులు విషయాన్ని టీటీ అధికారులకు చేరవేశారు. దీంతో టీటీడీ, ఫారెస్ట్‌ అధికారుల బృందం వెంటనే రంగంలోకి దిగి, ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమల అలిపిరి మార్గంలో మళ్లీ హైటెన్షన్ నెలకొంది. వరుస ఘటనలతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. కాగా, తిరుమల మెట్ల మార్గం పరిసరాల్లో మొత్తం మూడు చిరుతలు సంచరిస్తున్నాయని టీటీడీ వెల్లడించింది. వాటిని పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు, టీటీడీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల మెట్ల మార్గంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని భక్తులందరూ సహకరించాలని కోరారు. చిరుతలను పట్టుకునేందుకు చర్యలు తీసుకున్నామని, ఫారెస్ట్ అధికారులకు సహకరిస్తామని టీటీడీ వెల్లడించింది. తిరుమల మెట్ల మార్గంలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సమీపంలో మూడు రోజుల క్రితం నెల్లూరు జిల్లాకు చెందిన చిన్నారి లక్షితను చిరుత బలితీసుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...