Leopards: ఏపీలో చిరుతలు పెరిగాయా..? తెలుగు రాష్ట్రాల్లో దర్జాగా బయటకొస్తున్న చిరుతలు..

|

Aug 23, 2023 | 9:46 PM

తెలుగు రాష్ట్రాల్లో చిరుతలు..వరుసగా భయపెడుతున్నాయి. తిరుమలలో ఇప్పటికే రెండు చిరుతలను బంధించారు. ఇప్పుడు నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని పెద్దకంబలూరు గ్రామ సమీపంలో రెండు చిరుత పులులు సంచరిస్తూ ఉండడంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం శ్రీరంగాపురం గ్రామ సమీపంలో చిరుత పులి సంచరించినప్పటికీ ఫారెస్ట్ అధికారులు..

తెలుగు రాష్ట్రాల్లో చిరుతలు..వరుసగా భయపెడుతున్నాయి. తిరుమలలో ఇప్పటికే రెండు చిరుతలను బంధించారు. ఇప్పుడు నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని పెద్దకంబలూరు గ్రామ సమీపంలో రెండు చిరుత పులులు సంచరిస్తూ ఉండడంతో రైతులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మూడు రోజుల క్రితం శ్రీరంగాపురం గ్రామ సమీపంలో చిరుత పులి సంచరించినప్పటికీ ఫారెస్ట్ అధికారులు చిరుత పులిని అడవిలోకి తిరిగి పంపించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మరికొన్ని చిరుతపులులు అటవీ సమీప గ్రామాలైన పెద్ద కంబలూరు సమీపంలోని పంట పొలాల్లో సంచరిస్తూ రైతులను గడగడలాడిస్తున్నాయి. చిరుత పులుల సంచారం గురించి రైతులు ఫారెస్ట్ అధికారులకు తెలియజేసినప్పటికీ వారు అటవీ సమీపంలో చిరుత పులులు వస్తూపోతూ ఉంటాయని అంతమాత్రాన భయపడాల్సిన అవసరం లేదని నిర్లక్ష్య సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తిరుమల అడవుల్లో ఓ బాలికపై చిరుత దాడి చేసి చంపడంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు చిరుతల సంచారం అంటేనే భయాందోళన చెందుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Follow us on