Gautam Singhania: ధర చూస్తే కోట్లు.. కారుమాత్రం దరిద్రం.. ఇంత దరిద్రపుగొట్టు కారు మరొకటి ఉండదు.: గౌతమ్‌ సింఘానియా.

|

Aug 23, 2023 | 9:39 PM

లగ్జరీ కార్ల తయారీకి పెట్టింది పేరు ఇటలీకి చెందిన మాసెరాటి కంపెనీ . లాంబోర్ఘిని, పోర్షే,ఫెరారీ వంటి హైఎండ్ కార్ల కంపెనీల వరుసలోనే మాసెరాటి కూడా నిలుస్తోంది. మాసెరాటి ఎంసీ-20 పేరుతో ఓ విలాసవంతమైన కారును తీసుకువచ్చింది ఈ కంపెనీ. దీని ప్రారంభ ధరే 3.69 కోట్లు సూపర్ కార్ కేటగిరీకి చెందిన ఈ కారును అత్యంత సంపన్నులు తప్ప ఎవరూ కొనలేరు. దీని స్పీడు, ఇంటీరియర్స్ డిజైన్‌, దీని లుక్, స్టయిల్ ఏది చూసినా వారెవ్వా అనిపిస్తుంది ఈ కారు.

లగ్జరీ కార్ల తయారీకి పెట్టింది పేరు ఇటలీకి చెందిన మాసెరాటి కంపెనీ . లాంబోర్ఘిని, పోర్షే,ఫెరారీ వంటి హైఎండ్ కార్ల కంపెనీల వరుసలోనే మాసెరాటి కూడా నిలుస్తోంది. మాసెరాటి ఎంసీ-20 పేరుతో ఓ విలాసవంతమైన కారును తీసుకువచ్చింది ఈ కంపెనీ. దీని ప్రారంభ ధరే 3.69 కోట్లు సూపర్ కార్ కేటగిరీకి చెందిన ఈ కారును అత్యంత సంపన్నులు తప్ప ఎవరూ కొనలేరు. దీని స్పీడు, ఇంటీరియర్స్ డిజైన్‌, దీని లుక్, స్టయిల్ ఏది చూసినా వారెవ్వా అనిపిస్తుంది ఈ కారు. అలాంటి ఈ కారును చెత్త కారు అంటూ తీసిపారేశారు ఓ వ్యాపార దిగ్గజం. భారత వ్యాపార దిగ్గజం, రేమాండ్ గ్రూప్ ఎండీ గౌతమ్ సింఘానియాకు మాసెరాటి ఎంసీ20 కారు అస్సలు నచ్చలేదట. ఓ చెత్త కారులా అనిపించిందట. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్‌ ఖాతాలో వెల్లడించారు. ఇంత దరిద్రగొట్టు కారును తన జీవితంలో నడపలేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా మాసెరాటి ఎంసీ20 కారును కొనాలనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి అని సలహా కూడా ఇచ్చారు. అంతేకాదు, ఇది అత్యంత ప్రమాదకరమైన కారు అని తాను గట్టిగా నమ్ముతున్నానని, ఈ కారు నడిపేవాడు ఎప్పుడో ఒకప్పుడు దాంట్లోనే చస్తాడనిపిస్తోంది. భారత ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవాలి అంటూ గౌతమ్ సింఘానియా పేర్కొన్నారు. అయితే ఈ కారుతో తనకు ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది? ఎందుకు ఆ కారు విషయంలో ఇలా స్పందించారన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. సింఘానియా విమర్శల పట్ల మాసెరాటి వర్గాలు స్పందించాయి. అత్యంత కఠిన ప్రమాణాలకు లోబడి తమ కారును రూపొందించామని, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో దీనిని తయారుచేశామని,అన్ని విధాలా తనిఖీ చేశాకే కారు కంపెనీ దాటి బయటికి వస్తుందని అన్నారు. సింఘానియా వ్యక్తం చేసిన అభ్యంతరం కారు డిజైన్ కెపాసిటీకి సంబంధించిందిగా గుర్తించామని, తమ ఉత్పాదనకు సంబంధించిన ఎలాంటి విషయాలను అయినా, ఫీడ్ బ్యాక్ ను అయినా తాము తీవ్రంగా పరిగణించి, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతేకాదు, తమ కారుకు తిరుగులేదని, పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది అంటూ మాసెరాటి ఓ ప్రకటన విడుదల చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...

Follow us on